Site icon NTV Telugu

AHA : జనక అయితే గనక గోల్డెన్ అఫర్

Aha

Aha

క్యారక్టర్ ఆర్టిస్ట్ నుండి నటుడిగా మారి విభిన్న కథలను ఎంచుకుంటూ వరుస సినిమాలు చేస్తున్నాడు యంగ్ హీరో సుహాస్. కలర్ ఫోటో సినిమా ద్వారా ఆడియెన్స్ దృష్టిని ఆకర్శించాడు సుహాస్. అలా తాఅంజు నటించే ప్రతి సినిమాలోను కొత్తదనం ఉండేలా చూసుకుంటూ తన జర్నీ కొనసాగిస్తున్నాడు ఈ హీరో. ఇటీవల సుహాస్ హీరోగా ‘జనక అయితే గనక’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి అక్టోబరు 12న విడుదలైంది. విభిన్న కథాంశంతో వచ్చిన కూడా ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ స్పందనలకు పరిమితమైంది. ఇందులో సంగీత విపిన్ హీరోయిన్‌గా నటించింది. దిల్‌ రాజు కాంపౌండ్ నుంచి వచ్చిన సినిమా కావడంతో సహజంగానే ప్రేక్షకులు ఆసక్తి కనబర్చారు. కానీ ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో మెప్పిచలేకపోయింది.

Also Read : Ghaati : ఫస్ట్ లుక్ తో బయపెడుతున్న ‘అనుష్క’

కానీ సుహాస్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడీ ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయింది. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా ఓటీటీ వేదికగా నవంబర్‌ 8 నుంచి జనక అయితే గనక స్ట్రీమింగ్‌ కానుంది. అయితే సదరు ఆహా ఓటీటీ ఈ సినిమా వీక్షించేందుకు స్పెషల్ అఫర్ ఇస్తోంది. ఆహా గోల్డ్‌ సబ్‌స్క్రైబ్ కలిగి ఉన్న యూజర్స్ కు జనక అయితే గనక సినిమాను ఒకరోజు ముందుగా అనగా 24 గంటల ముందే వీక్షించే వెసులుబాటు ఇచ్చింది. సీనియర్ నటులు రాజేంద్ర‌ప్ర‌సాద్‌, సంగీర్త‌న విపిన్‌, గోప‌రాజు ర‌మ‌ణ‌, వెన్నెల కిశోర్‌, ముర‌ళీశ‌ర్మ‌ కీలక పాత్రల పోషించిన ఈ సినిమాను వీకండ్ సందర్భంగా చూస్తూ ఎంజాయ్ చేసేయండి.

Exit mobile version