Site icon NTV Telugu

Janhvi Kapoor : హమ్మయ్య.. జాన్వీ కపూర్ కు ఓ హిట్ పడింది..

Bollywood (1)

Bollywood (1)

దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రొమాంటిక్ కామెడీ మూవీ… సన్నీ సంస్కారి కీ తులసి కుమారి. వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ఈ సినిమా కాంట్రవర్సిలో నిలిచింది. మొదట దుల్హనియా 3 టైటిల్‌తో ఈ సినిమా రూపొందించాలనుకున్నారని, అలియా భట్ స్థానంలో జాన్వీ కపూర్ ని తీసుకొచ్చారంటూ ప్రచారం సాగింది. శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలోదుల్హనియా ఫ్రాంచైజీ బాలీవుడ్‌లో హిట్ సిరీస్‌గా నిలిచింది

Also Read : Bandla Ganesh : బండ్ల గణేష్ ట్వీట్ ఎవరికోసమో?

. వరుణ్ ధావన్, అలియా భట్ జంటగా వచ్చిన హంప్టీ శర్మా కీ దుల్హనియా (2014), బద్రీనాథ్ కీ దుల్హనియా (2017) రెండూ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించాయి. ఇక ఈసారి జాన్వీ , వరుణ్ జంటగా వచ్చిన సన్నీ సంస్కారి కీ తులసి కుమారి ప్రత్యేకమైన కథతో ప్రేక్షకుల ముందుకొచ్చి పండుగ వాతావరణంలో హంగామా క్రియేట్ చేస్తోంది. ఈ మూవీ మ్యూజిక్, ఎమోషన్స్ తో ఆడియన్స్ కి పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. వరుణ్ ధావన్ తన సిగ్నేచర్ పెర్ఫార్మెన్స్ తో కో యాక్టర్స్ ని బూస్ట్ అప్ చేసాడు, వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. సన్యా మల్హోత్రా, రోహిత్ సరాఫ్ ఫ్రెష్ నెస్ తీసుకొచ్చారు. డాన్స్ పెర్ఫార్మన్స్, టైమింగ్ కామెడీ, డ్రామాతో ప్రేక్షకుల ప్రశంసలు దక్కించుకుంది. శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, హంప్టీ శర్మ కీ దుల్హానియా మరియు బద్రీనాథ్ కీ దుల్హానియా హిట్ చిత్రాల తర్వాత వరుణ్ తో అతని మూడవ సినిమా. ఈ సినిమాతో చాన్నాళ్ల తర్వాత జాన్వీకి ఒక హిట్ సినిమా వచ్చింది.

Exit mobile version