NTV Telugu Site icon

Subrahmanyaa Glimpse : దర్శకుడిగా సాయి కుమార్ తమ్ముడు.. సుబ్రహ్మణ్య గ్లింప్స్ రిలీజ్

Untitled Design (32)

Untitled Design (32)

సీనియర్ నటుడు సాయి కుమార్ తమ్ముడు, ప్రముఖ నటుడు మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ పి.రవిశంకర్ తన స్వీయ దర్శకత్వంలో “సుబ్రహ్మణ్య” సినిమాతో కుమారుడు అద్వాయ్‌ని హీరోగా పరిచయం చేస్తున్నారు. సోషియో ఫాంటసీ అడ్వెంచర్‌ గా వస్తోన్న ఈ సినిమా నుండి విడుదల చేసిన “సుబ్రహ్మణ్య గ్లింప్స్ – ది ఫస్ట్ అడ్వెంచర్” ఆకట్టుకుంటుంది. SG మూవీ క్రియేషన్స్ నిర్మించిన, సుబ్రహ్మణ్య ఒక సోషియో ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం, P రవిశంకర్ దర్శకత్వం వహించారు మరియు తిరుమల్ రెడ్డి నిర్మించారు.

Also Read : Rajinikanth : వెట్టైయాన్ ఆడియో, ప్రీ వెన్యూ డేట్ ఇదే…

దుబాయ్‌లో జరిగిన ప్రముఖ సైమా అవార్డు ఫంక్షన్‌లో దక్షిణాది చిత్ర పరిశ్రమ నటీనటుల సమక్షంలో ఈ చిత్ర ఫస్ట్ గ్లింప్స్‌ ను ప్రదర్శించారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఫస్ట్ గ్లింప్స్‌ ను రిలీజ్ చేసారు మేకర్స్. గ్లింప్స్‌ లో అద్వాయ్ విషపూరిత పాములతో నిండిన బావిలోకి దూకడం. అతను దొంగచాటుగా లోపలికి ప్రవేశించి, ఒక పురాతన పుస్తకాన్ని తీసుకొని, అన్ని పాములు తనను వెంబడించడంతో పరుగెత్తడం వంటి సీన్స్ ఆకట్టుకున్నాయి. చివరలో చుట్టూ పాములు సమూహం చేరగా అద్వయ్ బ్యాగ్రౌండ్ లో పురాతన ఆలయాన్ని చూపిస్తూ శ్రీరాముడు ని చూపించిన విధానం గ్లింప్స్‌ కే హైలెట్ గా నిలిచాయి. కెజిఎఫ్ సంగీత దర్శకుడు రవి బస్రుర్ ఈ సినిమాకు అందించిన BGM  సూపర్ గా ఉందనే చెప్పాలి. VFX మరియు యానిమేషన్ అత్యుత్తమంగా ఉన్నాయి మరియు ప్రేక్షకులకు కొత్త ప్రపంచాన్ని చూపించాయి. దర్శకుడు పి రవిశంకర్ టేకింగ్, నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫస్ట్ గ్లింప్స్‌తో సినిమాపై ప్రేక్షకుల్లో కాస్త ఆసక్తి పెంచారు మేకర్స్.

Show comments