టాలీవుడ్ టైర్ 2 హీరోలలో సక్సెస్ రేట్ ఏక్కువ ఉన్న హీరో అడివి శేష్ మొదటి స్తానంలో ఉంటారు. విభిన్న కథలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సినిమాలు అందించాడు అడివి శేష్. అదే జోష్ లో ఆ మధ్య డెకాయిట్ అనే సినిమానుప్రకటించాడు. ఈ సినిమాలో అడివి శేష్ సరసన హీరోయిన్ గా శృతి హాసన్ తీసుకున్నారు. ఆ తర్వాత క్రియేటివ్ డిఫ్రెన్స్ కారణంగా ఆమె ఈ సినిమా నుండి వైదొలగడం చక చక జరిగాయి. శృతి స్తానంలో మృణాల్ ను తీసుకున్నాడు శేష్. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో డెకాయిట్ : ఎ లవ్ స్టోరీ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
Also Read : Bollywood : సత్తా చూపించని టాలీవుడ్.. అదరగొట్టిన శాండిల్ వుడ్
కాగా ఈ సినిమాను ఈ ఏడాది క్రిస్మస్ కనుకగా డిసెంబరు 25న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అందుకు తగ్గట్టే షూటింగ్ షెడ్యూల్ ను జెట్ స్పీడ్ లో చేయాలనీ ప్లాన్ చేసారు. కానీ డెకాయిట్ షూటింగ్ లో అడవి శేష్ గాయపడడంతో షూటింగ్ వాయిదా పడింది. ఈ సినిమా కోసం అడివి శేష్ పై ఇంకొన్ని భారీ ఎపిసోడ్స్ తీయాల్సివుంది. అడివి శేష్ గాయం నుండి కోలుకున్నాడు కానీ వైద్యులు మాత్రం ఇంకొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని షూటింగ్ చేయద్దని సూచించారు. దాంతో డెకాయిట్ షూట్ వాయిదా పడింది. తాజాగా ఈ సినిమాను వచ్చే ఏడాది ఉగాది పండుగ కానుకగా మార్చి 19న రిలీజ్ చేస్తున్నామని అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్.
