Adivi Sesh: “నీకు కూడా ఫ్యాన్స్ ఉన్నారా?” అన్నవారికి అడివి శేష్ షాకింగ్ రిప్లై!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adivi Sesh: టాలీవుడ్లో వైవిధ్యమైన కథలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో అడివి శేష్. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తన అభిమానుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో తనపై వచ్చే ట్రోల్స్‌కు ఆయన తనదైన శైలిలో కౌంటర్ ఇస్తూనే, ఒక నటుడికి ఉండాల్సిన అసలైన ఫ్యాన్ బేస్ అంటే ఏంటో వివరించారు. “నీకు కూడా ఫ్యాన్స్ ఉన్నారా?” అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న రివర్స్ ట్రోలింగ్‌పై శేష్ స్పందించారు.
ఈ సందర్భంగా ఆయన ఒక సంఘటనను గుర్తు చేశారు.. ” గూఢచారి 2 గురించి ఒక ట్వీట్ వేస్తూ థాంక్యూ టూ ఫ్యాన్స్ అని ఏదో వేశాను. నేను పొరపాటున కూడా రిప్లైలను చదవను. కానీ దానికి చదివితే ఈ పోస్ట్‌కు ఒకరు నీ కూడా ఫ్యాన్స్ ఆ అని కామెంట్ వేశారు. అయితే నా ఉద్దేశ్యం ఏంటంటే.. ఈ ఫ్రాంచైజీకి ఫ్యాన్స్ ఉన్నారని నా ఉద్దేశ్యం. కానీ ఎక్కడో కాలింది.. నన్ను నమ్మి థియేటర్లకు వచ్చేవాళ్లు ఉన్నారు.. నన్ను అమితంగా ప్రేమించేవాళ్లు ఉన్నారు. మరి వాళ్లని ఫ్యాన్స్ అనకూడదా?” అని ప్రశ్నించారు. కేవలం ఈలలు వేసి, గోల చేసేవారే కాకుండా, సినిమాలోని కంటెంట్‌ను ఇష్టపడి తనను ప్రోత్సహించే ప్రతి ఒక్కరూ తన అభిమానులేనని ఆయన స్పష్టం చేశారు. తనపై వచ్చే విమర్శలను, ట్రోల్స్‌ను ఆయన ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదన్నారు. ‘మేజర్’, ‘హిట్-2’ వంటి చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న శేష్, తన సినిమాలకు వస్తున్న వసూళ్లే తన అభిమానుల బలానికి నిదర్శనమని పరోక్షంగా గుర్తు చేశారు. ఇండస్ట్రీలో ఒకప్పుడు కేవలం స్టార్ పవర్ ఉంటేనే ఫ్యాన్స్ ఉండేవారు. కానీ అడివి శేష్ వ్యాఖ్యలతో ‘కంటెంట్ నమ్ముకున్న నటులకు’ కూడా బలమైన ఫ్యాన్ బేస్ ఉంటుందని మరోసారి రుజువు అయ్యింది.
Also Read
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!