ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ బాగా నడుస్తోంది. కథలో విషయం లేకున్నా కూడా పక్క భాషాల నుండి నటీనటులను తీసుకువచ్చి దానికి పాన్ ఇండియా కలర్ పూస్తున్నారు మేకర్స్. ఇలాంటి టైమ్ లో టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శేష్ నటిస్తున్న తదుపరి చిత్రం ‘ డెకాయిట్’. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
Also Read : TheRajaSaab : రాజాసాబ్ రన్ టైమ్ పై టెన్షన్ పడుతున్న ఫ్యాన్స్
అయితే ఈ సినిమాను హిందీలో డబ్బింగ్ సినిమాగా కాకుండా తెలుగుతో పాటు హిందీలోను ఒకేసారి షూట్ చేస్తున్నాడు. తన నిర్ణయం గురించి అడివి శేష్ మాట్లాడుతూ, “నా దృష్టిలో భాష అనేది కేవలం ఒక మాధ్యమం కాదు, అది భావోద్వేగం. ఒక కథను అనువదించినప్పుడు లేదా డబ్ చేసినప్పుడు ఎక్కడో ఒక చోట, ఏదో ఒకటి తప్పనిసరిగా మిస్ అవుతుంది. సినిమాలోని సారాంశం, కథ ఫ్లో, ఎమోషన్ సరిగా క్యారీ అవదు. భారీ సినిమాలు చేసేటప్పుడు మనం అనుకున్న విధంగా డబ్బింగ్ రాకపోవచ్చు. అందుకే డెకాయిట్ ను మొదట తెలుగు మరియు హిందీ రెండింటిలోనూ డబ్ చేయకుండా విడివిడిగా షూట్ చేస్తున్నాను. కొన్ని ఎమోషన్స్ చాలా బలంగా సహజంగా ఉండాలి. అవి సహజంగా లేకుంటే ఆడియెన్స్ కనెక్ట్ అవలేరు. అందువల్ల స్ట్రయిట్ లాంగ్వేజ్ లో షూట్ చేయడమనేది నాకు ఎప్పుడు ఇష్టం” అని అన్నారు. అడివి శేష్ తీసుకున్న ఈ డెసిషన్ అసలైన పాన్ ఇండియా సినిమా అంటే ఏంటో తెలిజేయజేస్తుంది. ఏ కథకైనా స్టార్ కాస్టింగ్ తో పాటు భావోద్వేగం ముఖ్యం. అది ఒరిజినల్ భాషలో షూట్ చేసి చూపించనపుడే ఆడియెన్స్ కనెక్ట్ అవుతారు.
