Site icon NTV Telugu

Adivi Sesh : అడివిశేష్ ‘డెకాయిట్’ క్రిస్మస్ రిలీజ్ వాయిదా..

Decoit

Decoit

టాలీవుడ్ యంగ్ హీరోలలో సక్సెస్ రేట్ ఏక్కువ ఉన్న హీరోలలో అడివి శేష్ ఎప్పుడు మొదటి స్తానం ఉంటారు.విభిన్న కథలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సినిమాలు అందించాడు అడివి శేష్. అదే జోష్ లో ఆ మధ్య డెకాయిట్ అనే సినిమానుప్రకటించాడు. ఈ సినిమాలో అడివి శేష్ సరసన హీరోయిన్ గా శృతి హాసన్ ను తీసుకున్నట్టు అధికారకంగా ప్రకటిస్తూ ఓ వీడియో కూడా రిలీజ్ చేసారు మేకర్స్. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో డెకాయిట్ : ఎ లవ్ స్టోరీ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

Also Read : Rajni – Kamal : రజనీకాంత్ – కమల్ హాసన్ మల్టీస్టారర్ డైరెక్షన్ పై ప్రదీప్ రంగనాధ్ షాకింగ్ కామెంట్స్

అయితే ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా శ్రుతి హాసన్‌ తీసుకోవడం ఆ తర్వాత ఆమె వైదొలగడం చక చక జరిగాయి. శృతి స్తానంలో మృణాల్ ను తీసుకున్నారు. కాగా ఈ సినిమాను ఈ ఏడాది క్రిస్మస్ కనుకగా డిసెంబరు 25న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అందుకు తగ్గట్టే షూటింగ్ షెడ్యూల్ ను జెట్ స్పీడ్ లో చేయాలనీ ప్లాన్ చేసారు. కానీ డెకాయిట్ షూటింగ్ లో అడవి శేష్ గాయపడడంతో షూటింగ్ వాయిదా పడింది. ఈ సినిమా కోసం అడివి శేష్ పై ఇంకొన్ని భారీ ఎపిసోడ్స్ తీయాల్సివుంది. అడివి శేష్ గాయం నుండి కోలుకున్నాడు కానీ వైద్యులు మాత్రం ఇంకొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని షూటింగ్ చేయద్దని సూచించారు. దాంతో డిసెంబర్ 25న రావాల్సివున్న డెకాయిట్ సినిమా వాయిదా పడింది. శేష్ తిరిగి షూట్ లో జాయిన్ అయ్యాక కొత్త డేట్ ను ప్రకటిస్తారు.

Exit mobile version