Srinidhi Shetty :’ఆదర్శ కుటుంబం’ సీక్రెట్ లీక్ చేసిన శ్రీనిధి!

Adarsha Kutumbam Theme

Adarsha Kutumbam Theme

టాలీవుడ్‌లో ఇప్పుడు రిలీజ్ డేట్స్ కన్ఫ్యూజన్ నడుస్తోంది. ఒకసారి డేట్ అనౌన్స్ చేశాక, పోస్ట్ ప్రొడక్షన్ పనులు హడావిడిగా ముగించుకుని థియేటర్లలోకి వచ్చే సినిమాలు చాలా ఉన్నాయి. కానీ క్వాలిటీ విషయంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఎక్కడా రాజీ పడదని నిర్మాత రాధాకృష్ణ అంటున్నారు. విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ డేట్ అక్టోబర్ 2 నుంచి ముందు 9, తర్వాత దీపావళి కానుకగా అక్టోబర్ 30కి ఎందుకు వాయిదా పడిందో హీరోయిన్ శ్రీనిధి శెట్టి కుండబద్దలు కొట్టింది.

భారీ అంచనాలున్న ఈ సినిమా కోసం టీమ్ ఏకంగా ఏడాదిన్నర పాటు తీవ్రంగా శ్రమించిందని ఆమె తెలిపింది. “ఒక సినిమాపై ఇంతకాలం కష్టపడి, అవుట్‌పుట్ ఇంకా అద్భుతంగా మెరుగుపరిచే అవకాశం ఉన్నప్పుడు, కంగారుపడి హడావిడిగా రిలీజ్ చేయడం కంటే ఓ మూడు వారాలు వెనక్కి వెళ్లడమే కరెక్ట్ అని మేకర్స్ భావించారు. నిర్మాత నాగవంశీ గారు కూడా మాకు ఇదే చెప్పారు. ఈ అదనపు 21 రోజుల సమయం వల్ల ‘ఆదర్శ కుటుంబం’ మరింత అందంగా, పర్ఫెక్ట్‌గా తయారైంది” అని శ్రీనిధి వెల్లడించింది. సినిమా క్వాలిటీకి వాళ్ళు ఇస్తున్న ప్రాధాన్యత చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద బొనాంజా గ్యారెంటీ అనిపిస్తోంది.