NTV Telugu Site icon

Trisha: 25 లక్షలకు రిసార్టు ఆరోపణలు.. అన్నాడీఎంకే నేతకు త్రిష లీగల్ నోటీస్

కొన్ని రోజుల క్రితం నటి త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అన్నాడీఎంకే మాజీ సేలం యూనియన్ సెక్రటరీ ఏవీ రాజుకు నటి త్రిష లాయర్‌ నోటీసు పంపారు. నటి త్రిష తన ట్విట్టర్ ద్వారా లీగల్ నోటీసుల ఫోటోలను షేర్ చేసింది. ఈ నోటీసులో త్రిష తన గురించి AV రాజు మాట్లాడిన వీడియోలు, ఆ వీడియోల గురించి వచ్చిన వార్తల లింక్‌లను కూడా యాడ్ చేశారు. ఇక ఈ వ్యాఖ్యల నేపథ్యంలో త్రిష మన నష్టపరిహారం కోరినట్లు నోటీసులో పేర్కొన్నారు. అయితే ఎంత అడిగారనేది కనపడకుండా త్రిష దాన్ని కవర్ చేశారు. ఎ.వి.రాజు చేసిన ఆరోపణల కారణంగా త్రిష మానసిక క్షోభకు గురైందని, దీంతో 4 రోజులలో నిర్ణీత మొత్తాన్ని ఆమెకు చెల్లించాలని లాయర్ నోటీసులో పేర్కొన్నారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అలాగే సోషల్ మీడియాలో ఏ రూపంలోనైనా త్రిషపై పరువు నష్టం కలిగించడాన్ని ప్రచురించడం / ప్రదర్శించడం తక్షణమే నిలిపివేయాలని కూడా ఆ నోటీసులో పేర్కొన్నారు.

Also Read; Shreyas Iyer-BCCI: బీసీసీఐకి అడ్డంగా దొరికిపోయిన శ్రేయాస్ అయ్యర్.. చర్యలు తప్పవా?

ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా మొదలైన వాటిలో త్రిషపై చేసిన పరువు నష్టం కలిగించే ప్రకటనలు, ఆరోపణలకు సంబంధించిన అన్ని రికార్డులను వెంటనే తన స్వంత ఖర్చుతో తొలగించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పేర్కొంది. అయితే మరి రాజు ఈ విషయం మీద ఎలా స్పందించబోతున్నారు? త్రిష లీగల్ నోటీసులకు ఆయన సమాధానమిస్తారా? ఒకవేళ నాలుగు రోజులలో సమాధానం ఇవ్వకపోతే త్రిష లీగల్ టీం ఎలా ముందుకు వెళుతుంది? అనే అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ అంశం మీద త్రిషకు మద్దతు తెలుపుతూ విశాల్ ఒక సుదీర్ఘమైన ట్వీట్ చేశారు. అందులో త్రిష గురించి కానీ పొలిటికల్ లీడర్ గురించి కానీ ఎలాంటి ప్రస్తావన లేకపోయినా ఆయన క్రియేట్ చేసింది ఇదే విషయం గురించి అనే క్లారిటీ అయితే ఉంది.