Actress Kasturi : పరారీలో నటి కస్తూరి.. పోలీసుల గాలింపు
- తమిళ నటి కస్తూరి పరారీ
- బ్రాహ్మణేతరులు ఉద్యోగులపై వివాదాస్పద వ్యాఖ్యలు
- ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్న నటి కస్తూరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ నటి కస్తూరి పరారీలో ఉన్నారు. ఇటీవల కస్తూరి తీరు తమిళనాడు లో తీవ్ర చర్చినీయాంశంగా మారింది. కొద్ది రోజుల క్రితం చెన్నై లోని తెలుగు వారిపై వివాదాస్పద వ్యాఖ్యల చేసిన సంగతి తెలిసిందే. అవి కాస్త వివాదానికి దారితీయడంతో తెలుగు నా మెట్టినిల్లు, తెలుగు వారంతా నా కుటుంబం అంటూ వివరణ ఇస్తూనే అధికార డీఎంకే వాళ్లు తనపై కుట్ర చేస్తున్నారని వివరణ ఇచ్చింది. అయినప్పటికీ తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కస్తూరి పై చెన్నై మరియు మదురై సహా పలు ప్రాంతాల్లో కేసులు నమోదు చేసారు.
Also Read : suriya : తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ‘కంగువా’ రిలీజ్..
Also Read
- Varanasi : 'వారణాసి'లో తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసిన మహేశ్ బాబు
- CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
- TheParadise Premiere : నో కట్స్, నో బీప్స్.. ఓవర్సీస్లో నేడే 'ది ప్యారడైజ్' ప్రీమియర్లు!
- Sharwanand : ఓ హిట్ కొట్టాడో లేదో శర్వానంద్ రెమ్యునరేషన్‌కు రెక్కలొచ్చాయట
ఈ వివాదం ఒకవైపు జరుగుతుండగానే ప్రభుత్వ ఉద్యోగుల్లో బ్రాహ్మణేతరులు లంచాలు తీసుకుంటున్నారని కస్తూరి మాట్లాడడాన్ని ఉద్యోగ సంఘాలు ఖండించాయి. ప్రభుత్వ ఉద్యోగులపై నోటికొచ్చినట్టు మాట్లాడడాన్ని తమిళనాడు రెవెన్యూ అధికారుల సంఘం తీవ్రంగా వ్యతిరేకించింది. తమను కించ పరిచేలా మాట్లాడి తమ మనో భావాలను దెబ్బ తీసేలా మాట్లాడిన కస్తూరిపై చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వాన్ని రెవెన్యూ అధికారుల సంగం కోరింది. ఈ నేపథ్యంలో ఆమెపై చెన్నైలోని పలు స్టేషన్స్ లో కేసులు నమోదు అయ్యయి. కస్తూరిపై నమోదయిన కేసుల్లో ఆమెను విచారించేందుకు చెన్నై పోలీసులు సమన్లు జారీ చేసేందుకు కస్తూరి ఇంటికి వెళ్లారు. కానీ అక్కడ ఆమె ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గుర్తించారు. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసి ఉండడంతో ప్రస్తుతం ఆమె ఎక్కడ ఉందని విషయమై పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కస్తూరి తమిళనాడు విడిచి వెళ్లి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.
తాజావార్తలు
-
Varanasi : ‘వారణాసి’లో తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసిన మహేశ్ బాబు
-
Motorola Signature 27: మోటరోలా సిగ్నేచర్ 27 లాంచ్.. 200MP కెమెరా, Gemini AI, Bang & Olufsen ఆడియో ఫీచర్స్
-
Rubik’s Cube World Record: 6 ఏళ్ల చిన్నారి అద్భుతం.. 4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు
-
CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
ట్రెండింగ్
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!