Anasuya: నా గొంతు నొక్కేయాలని చూశారు.. భరించలేకే జబర్దస్త్ నుంచి బయటకొచ్చా?

Anasuya

Anasuya

ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూపై నిక్కచ్చిగా స్పందిస్తూ సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచే నటి, స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ మరోసారి టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారారు. పెద్దిలో జాన్వీ కపూర్ పాత్ర మీద నెగిటివిటీ అనంతరం దర్శకుడు బుచ్చిబాబు స్పందన అనంతరం ఆమె ట్వీట్ చేయడంతో ఆ సినిమా పేరు ప్రస్తావించక పోయినా ఆమె ఈ అంశం గురించే ట్వీట్ చేసిందనే చర్చ జరుగుతోంది. క్రియేటివ్ ఫ్రీడమ్ పేరుతో సాగుతున్న కొన్ని ట్రెండ్స్‌పై, అలాగే సమాజం పట్ల సినిమా రంగానికి ఉండాల్సిన బాధ్యతలపై ఆమె పంచుకున్న కొన్ని స్క్రీన్‌షాట్స్ ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.

అనసూయ తన కెరీర్‌లో ఎదుర్కొన్న ఒక అత్యంత చేదు అనుభవాన్ని ఈ పోస్ట్‌లో బహిరంగంగా పంచుకున్నారు. గతంలో కొన్ని సామాజికాంశాలపై తను తీసుకున్న స్టాండ్స్, నిర్మొహమాటంగా చెప్పిన వ్యక్తిగత అభిప్రాయాల వల్ల.. సదరు మేకర్స్ క్రియేటివిటీకి తను పెద్ద అడ్డుకట్టలా మారాను అనే నెగటివ్ ముద్ర వేయడానికి ప్రయత్నించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మనస్తాపంతోనే, తన గొంతు నొక్కేయాలని చూసిన ఒక పాపులర్ షో నుంచి తను పూర్తిగా తప్పుకోవాల్సి వచ్చిందని సంచలన విషయాన్ని బయటపెట్టారు. అయితే ఆ షో ఏమిటి అనే విషయాన్నీ ఆమె చెప్పక పోయినా ఆమెకు పేరు తెచ్చిన జబర్దస్త్ గురించే ఆమె మాట్లాడుతోంది అనే చర్చ జరుగుతోంది. ఆ తర్వాత ఇండస్ట్రీలో తన టాలెంట్‌ను నిరూపించుకోవడానికి, ఒక ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి సరైన ప్లాట్‌ఫారమ్ దొరకక ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నానని తెలిపారు. అయినప్పటికీ, తను నమ్మిన సిద్ధాంతాల కోసం నిలబడటానికి ఎప్పుడూ వెనకడుగు వేయలేదని, భవిష్యత్తులోనూ వేయనని ఆమె ఎంతో ధైర్యంగా స్పష్టం చేశారు.

×
×
Ad