Aamani : “రేపు నువ్వే హీరోయిన్” అని, కథలు వినటానికి గెస్ట్ హౌస్ లకి రమ్మని చెప్పేవారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటి ఆమని తాజా ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లోకి వచ్చాక ఒక స్టేజ్ లో ఇంకా వెళ్ళిపోదాము వెనక్కి అని డిసైడ్ అయిపోయా, ఇండస్ట్రీ చాలా దారుణంగా ఉండేది.. ఇంకా నేను ఫేస్ చేయలేక, నాకు సెట్ అవ్వలేదని అనిపించేదని ఆమె అన్నారు. నా మనస్తత్వానికి, నేను పెరిగిన ఒక వాతావరణం వలన నాకు ఇక్కడ ఇండస్ట్రీకి నేను సెట్ అవ్వలేదు. ఇంతింత డ్రెస్ వేసుకోవాలి అని చెప్తే నాకు ఎందుకో నాకు మంచిగా అనిపించలేదు. అప్పటికి అది కూడా ఓకే, సినిమాలో వేయమంటే వేస్తాను, కానీ ఆఫీస్ లో వెళ్ళిన తర్వాత కూడా మోకాళ్ళ వరకు వేసుకొని తొడలు చూపించమనేవారు.. ఎక్కడో డిస్టర్బ్ అయ్యాను. అబ్బో ఇది మనకి సెట్ అవ్వదు, నేను ఇంకా “లేదమ్మా, వెళ్ళిపోదాం మనం, మనకి సెట్ అవ్వదు అని చెప్పా. పైగా ఆడిషన్ కి వెళ్తున్నాం వస్తున్నాం కానీ ఏ ఒక మంచి ఆపర్చునిటీ కూడా దొరకట్లేదు. ఎందుకు టైమ్ వేస్ట్? వెళ్లి చదువుకుంటాను, నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను.” అని చెప్పాను.
అయితే హీరోయిన్ అవ్వాలంటే కమిట్మెంట్ ఇవ్వాల్సిందేనా ఇండస్ట్రీలో అని ఆమెను అడిగితే మస్ట్ అని ఏమీ లేదండి, ఫోర్స్ అయితే ఎవరూ లేరు. , ఫోర్స్ లేదు. కథలు వినటానికి గెస్ట్ హౌస్ లకి రమ్మని చెప్పేవారు కానీ వెళ్ళేదాన్ని కాదు. మా మమ్మీని తీసుకొని వస్తాను అంటే, “ఆ, మమ్మీ వద్దమ్మా, నువ్వు మాత్రం వస్తే చాలు” అనేవారు. ఇప్పుడు వెళ్తాము, ఓకే అయింది, “రేపు నువ్వే హీరోయిన్” అని, నెక్స్ట్ డే ఒక మేనేజర్ తో కార్ పంపించి, “నువ్వు మాత్రం రావాలి గెస్ట్ హౌస్ లో, సార్ పిలుస్తున్నారు, ప్రొడ్యూసర్ గారు లేకపోతే డైరెక్టర్ గారు…” ఏదో సంథింగ్ అక్కడ ఎవరు హైప్ ఉన్నారో వాళ్ళు, ఎవరు స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళు రమ్మన్నారు అనేవారు. మా అమ్మ, “అమ్మో పంపించేదే లేదమ్మా, నేను వస్తే తీసుకెళ్తాను, లేకపోతే వద్దు” అనేసి… అలా చాలా జరిగింది. ఇలా ఒక 60, 70 ఆడిషన్స్ నాకు ఫెయిల్ అయ్యాయి, కమిట్మెంట్ ఇవ్వలేదని ఒక్క కారణం వల్ల అని ఆమె చెప్పుకొచ్చారు.
Also Read
- Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
- The Paradise Advance Bookings: నైజాంలో నాని మాస్ ర్యాంపేజ్.. గంటల్లోనే లక్ష టికెట్లు సేల్!
- Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
- Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. 'వారణాసి'పై క్రేజీ అప్డేట్ వైరల్!
తాజావార్తలు
-
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
-
Mohit Sharma: హార్దిక్ పాండ్యాకు సరితూగడు.. నితీష్ రెడ్డిపై అంచనాలు వద్దు!
-
Apple iPhone Users: ఆపిల్ ఐఫోన్ ఉంటే డబ్బులు.. ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు? ఎలా దరఖాస్తు చేయాలి?
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
World Alzheimer’s Day: మెదడు మెల్లగా తన జ్ఞాపకాలను కోల్పోతోందా?
ట్రెండింగ్
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!