తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి ఐశ్వర్య రాజేష్. ఆమె హీరోయిన్‌గా నటించిన ‘ఓ సుకుమారి’ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తిరువీర్ హీరోగా నటించిన ఈ సినిమాతో భరత్ దర్శన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా, “ఆమెను ఎలాంటి పాత్రలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు? ఎలాంటి పాత్రలు ఛాలెంజింగ్‌గా ఫీల్ అవుతారు?” అని ప్రశ్నిస్తే.. తాను ఇప్పటివరకు అమాయకంగా ఉన్న పాత్రలు, గడుసుగా ఉన్న పాత్రలు చేశానని.. కానీ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయలేదని చెప్పింది. ఇసక పట్నం వెబ్ సిరీస్‌లో కొంత టచ్ అయి వెళ్లిపోయినట్లు అనిపిస్తుంది కానీ, అది పూర్తిస్థాయి నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర కాదు. తనకు రమ్యకృష్ణ చేసిన ‘నీలాంబరి’ తరహా పాత్రలు చేయాలని ఉందని, అలాగే ఈ మధ్య వచ్చిన Obesessionలో ఆ అమ్మాయి చేసిన సైకో పాత్రలు చేయాలని పిస్తుందని చెప్పుకొచ్చింది.
తాను తెలుగమ్మాయిని కాబట్టి ఏ యాస కూడా తనకు కష్టంగా అనిపించదని ఆమె చెప్పుకొచ్చింది. తాను అన్ని ప్రాంతాల యాసల్లో మాట్లాడగలనని.. తెలుగు, తమిళ భాషల్లోని యాసలతో కూడా నటించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది.

