Site icon NTV Telugu

పెరగాల్సింది భయం కాదు బాధ్యత: విక్టరీ వెంకటేష్

దేశంలో కరోనా మరణాలు ఎక్కువ అవుతుండటంతో జనాల్లో భయం పెరిగిపోతోంది. ఏ టైమ్ లో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందేమోననే నెగిటివ్ ఆలోచనలు కూడా ఎక్కువ అవుతున్నాయి. దీనిపై సినీ ప్రముఖులు ఎప్పటికప్పుడు భరోసా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్ పలు సూచనలు చేశారు. ‘మనం అందరం మన దేశానికి మనం సేవ చేసే టైం వచ్చింది. మనం ఏమీ చేయలేమని అనుకోవద్దు. రోజురోజుకూ భయం కాదు.. బాధ్యత పెరగాలి. అందరూ ఒకరికి ఒకరు దూరంగా ఉంటూ.. ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా ఉండాలి. కరోనా వైరస్ నుంచి మన దేశాన్ని మనమే రక్షించుకోవాలి.’ అని వెంకటేష్ ఓ వీడియో విడుదల చేశారు.

Exit mobile version