Site icon NTV Telugu

“చిన్నారి పెళ్లి కూతురు” బామ్మ ఇకలేరు

Actor Surekha Sikri dies of cardiac arrest

బాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటి, మూడుసార్లు జాతీయ అవార్డు అందుకున్న సురేఖ సిక్రీ కన్నుమూశారు. ఆమె వయసు 75 సంవత్సరాలు. ముంబైలో ఉంటున్న సురేఖ శుక్రవారం గుండెపోటుతో మరణించాడు. 2018 నుంచి పక్షవాతంతో బాధపడుతున్న ఆమెకు 2020లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఇలా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెకు నేడు గుండెపోటు వచ్చింది. సురేఖ సిక్రీ ప్రసిద్ధ టీవీ సీరియల్ “బాలికా వధు”తో దేశవ్యాప్తంగా కీర్తి పొందారు. ఏ సీరియల్ తెలుగులో “చిన్నారి పెళ్ళి కూతురు” పేరుతో విడుదలైంది. ఈ సీరియల్ లో ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులు కూడా సురేఖకు అభిమానులుగా మారిపోయారు.

Read Also : ఆకట్టుకుంటున్న “మాస్ట్రో” ఫస్ట్ సింగిల్

సురేఖ సిక్రీ 1971లో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్‌ఎస్‌డి) నుండి పట్టభద్రురాలైంది. 1978 పొలిటికల్ డ్రామా చిత్రం “కిస్సా కుర్సి కా”తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కిస్సా కుర్సీ కా, తమస్, సలీం లాంగ్డే పె మాట్ రో, పరినాటి, మమ్మో, నసీమ్, సర్దారీ బేగం, సర్ఫరోష్, జుబీడా, మిస్టర్ అండ్ మిసెస్ అయ్యర్, ఘోస్ట్ స్టోరీస్, మరియు బధాయ్ హో వంటి చిత్రాల్లో ఆమె నటించారు. తమస్ (1988), మమ్మో (1995), బధాయ్ హో (2018) చిత్రాలకు జాతీయ అవార్డులను దక్కించుకుంది. ఇక వ్యక్తిగత విషయానికొస్తే సురేఖ సిక్రీ, హేమంత్ రెగెను వివాహం చేసుకున్నారు. వారికి రాహుల్ సిక్రీ అనే కుమారుడు ఉన్నారు. ఆమె మరణించిన వార్త తెలిసిన పలువురు ప్రముఖులు తమ సంతాపం తెలియజేస్తున్నారు.

Exit mobile version