ఆకట్టుకుంటున్న “మాస్ట్రో” ఫస్ట్ సింగిల్

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ “మాస్ట్రో” ఫస్ట్ సింగిల్ ఈరోజు విడుదల అయ్యింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన “బేబీ ఓ బేబీ” అనే లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. వీడియో చూస్తుంటే ఈ పాటలో హీరోహీరోయిన్లు గోవా వంటి అందమైన ప్రాంతాల్లో ప్రేమలో మునిగితేలుతున్నట్లు అన్పిస్తోంది. ఇక ఈ లవ్ సాంగ్ ను అనురాగ్ కులకర్ణి పాడారు. వినసొంపుగా ఉన్న ఈ సాంగ్ కు శ్రీజో లిరిక్స్ అందించారు. ఈ సాంగ్ అందరినీ అట్ట్రాక్ట్ చేస్తోంది. “భీష్మ”తో నితిన్ కు అద్భుతమైన మ్యూజికల్ హిట్ ఇచ్చిన మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Read Also : డియర్ మేఘ : “ఆమని ఉంటే” లిరికల్ వీడియో సాంగ్

ఇక మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘మాస్ట్రో’. బాలీవుడ్ హిట్ మూవీ “అంధాదున్”కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్ లో సరసన నభా నటేష్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్రలో కన్పించనుంది. శ్రేష్ఠ్ మూవీస్‌ పతాకంపై రాజ్‌ కుమార్‌ ఆకేళ్ళ సమర్పణలో ఎన్‌.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫైన‌ల్ షెడ్యూల్ ఇటీవలే పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాకు థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. రొమాంటిక్ లవ్ సాంగ్ “బేబీ ఓ బేబీ” లిరికల్ వీడియో సాంగ్ ను మీరు కూడా వీక్షించి ఆనందించండి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-