Actor Srikanth: రొటీన్ కు భిన్నంగా సినిమాలు చేసుకుంటూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు సీనియర్ యాక్టర్ శ్రీకాంత్.. ఓ వైపుగా హీరోగా రాణిస్తూనే.. కథా ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తున్నారు. దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ‘వారసుడు’ సినిమా రూపొందింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించాడు. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాను రూపొందించారు. కాగా, తొలుత రెండు భాషల్లోనూ సినిమాను ఈ నెల 11న విడుదల చేయాలనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా తెలుగు వెర్షన్ రిలీజ్ ఈ నెల 14వ తేదీకి వెళ్లింది. ఈ సినిమాలో విజయ్ కి సోదరుడి పాత్రలో శ్రీకాంత్ నటించాడు. ఇటీవల శ్రీకాంత్ మాట్లాడుతూ .. ‘వారసుడు’లో ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ. అందువలన అన్ని ప్రాంతాలవారికి .. అన్ని భాషలవారికీ తప్పకుండా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా తమిళ అనువాదంలా కాకుండా, తెలుగు సినిమా మాదిరిగానే అనిపిస్తుంది.
Read Also: Veera Simha Reddy: యాడజూడు నీదే జోరు.. మొగతాంది నీదే పేరు
కోలీవుడ్ నుంచి ఇంతకుముందు నాకు ఎన్ని అవకాశాలు వచ్చిన చేయలేకపోయాను. తమిళంలో నేను చేసిన మొదటి సినిమా ఇదే. అదీ విజయ్ లాంటి స్టార్ హీరోతో కలిసి చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ మధ్య కాలంలో విజయ్ మాస్ యాక్షన్ సినిమాలే ఎక్కువగా చేస్తూ వచ్చారు. రొటీన్ కి భిన్నంగా ఆయన చేసిన సినిమా ఇది. ఆర్టిస్టులంతా తెలుగు సినిమాలు చేసినవారే .. తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసినవారే. అందువలన ఈ సినిమాను తెలుగులో చేసినట్టుగానే ఉంటుంది. మదర్ సెంటిమెంట్ .. ఫ్యామిలీ ఎమోషన్స్ .. తమన్ పాటలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. తప్పకుండా ఈ సినిమా ఒక ప్రభంజనం సృష్టిస్తుంది” అని చెప్పుకొచ్చారు. ఈ సినిమా ఈ నెల 11న రిలీజ్ అవుతుందనే ఉద్దేశంతో ప్రమోషన్స్ చేస్తూ వస్తున్నాం. కానీ దిల్ రాజు గారు కాల్ చేసి 14వ తేదీకి వెళుతున్నట్టు చెప్పగానే షాక్ అయ్యాను. ఇతరుల నిర్ణయాన్ని గౌరవించి ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోవడం నిజంగా విశేషమే” అన్నారు.