Site icon NTV Telugu

Shivaji Raja: శివాజీ రాజా అప్పుడలా.. ఇప్పుడిలా

Shivaji Raja

Shivaji Raja

Shivaji Raja: టాలీవుడ్ ప్రేక్షకులకు శివాజీ రాజా పరిచయం అక్కర్లేని పేరు. నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా, హీరోగా ఎన్నో వందల సినిమాలో నటించారు ఆయన. శివాజీ రాజా కాస్తా బొద్దుగా ఉంటారు. గతేడాది ఆయన గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అప్పుడు ఆయన బాగా చిక్కిపోయి దర్శనం ఇచ్చారు. ఇలా ఆయనను చూసి అందరూ షాక్‌ అయ్యారు. సోషల్‌ మీడియాలో ఆయను గురించి చర్చ కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన మీడియాకు దూరంగా ఉన్నారు. కొంతకాలం ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకుని ఇంటికి వచ్చినప్పటికీ తన ఆరోగ్యంపై ఎలాంటి అప్‌డేట్‌ లేదు. అలా మీడియాకు దూరంగా ఉన్న శివాజీ రాజా జులై నెలలో తన తనయుడు వినయ్‌ రాజా హీరోగా ఎంట్రీ ఇస్తున్న ‘వేయు శుభములు కలుగు నీకు’ సినిమాలోని ఓ సాంగ్‌ విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇందులో ఆయన బరువు తగ్గి చిక్కిపోయి కనిపించడంతో అందరి దృష్టి ఆయనపై పడింది. ఏంటి ఆయన ఇలా అయిపోయారు, శివాజీ రాజాకు ఏమైందంటూ ఫాలోవర్స్‌, అభిమానులు కంగారు పడ్డారు. అయితే ఆయనకు గుండెపోటు వచ్చాక బరువు తగ్గిపోయారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం ఆయన పూర్తిగా తన ఆరోగ్యంపైనే దృష్టి పెట్టారని ఈ క్రమంలో ఎక్కువగా బయటకు రావడం కానీ మీడియాతో మాట్లాడటం కానీ చేయడం లేదని వారు స్పష్టం చేశారు. తాజాగా నిర్మాత సురేష్ కొండేటితో కలసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆయన తన పూర్వ రూపాన్ని దక్కించుకున్నట్లు కనిపిస్తున్నారు. అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు అవుపిస్తున్నారు. మొదట్లో ఉన్నట్లు కాస్తంత బొద్దుగా తయారయ్యారు. ఈ ఫోటో చూసిన శివాజీ రాజా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా శివాజీ రాజా 35 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో నటుడిగా రాణించారు. తన కామెడియన్‌గా, విలన్‌గా, హీరోగా పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. అలా 400పైగా చిత్రాల్లో నటించిన ఆయన కొంతకాలం మా ఆధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య రిత్యా నటనకు బ్రేక్‌ ఇచ్చారు.

Exit mobile version