Actor Prabhu: ఆయన ఓ సీనియర్ నటుడు. తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం కూడా అక్కర్లేదు. అంజలి అంజలి అంటూ ప్రేక్షకులను అలరించి అమితంగా ఆకట్టుకున్న సీనియర్ హీరో. తమిళ హీరో అయినప్పటికీ డబ్బింగ్ చిత్రాల్లో నటించడంతోపాటు తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించడంతో తెలుగు వారికి కూడా సుపరిచితుడు. చంద్రముఖి, డార్లింగ్, శక్తి చిత్రాల ద్వారా ప్రభు తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ప్రస్తుతం ప్రభు తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది విడుదలైన తమిళ బ్లాక్ బస్టర్ పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1లో కూడా నటించారు. అవును మీరు ఊహించిన పేరే ఆయనే సీనియర్ నటుడు ప్రభు. ఎంతో యాక్టివ్ గా అందరితో కలివిడిగా ఉండే ఆయన నిన్న అస్వస్థతకు గురయ్యారు. దీంతో ప్రభు అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
Read also: Revanth Reddy: కొనసాగుతున్న రేవంత్ రెడ్డి హాథ్ సే హాథ్ జోడో యాత్ర.. నేడు భూపాలపల్లి నియోజకవర్గంలో..
ఇక ప్రభు ఇటీవల విడుదలైన వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమాలతో బిజీగా ఉన్న ప్రభు ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అతడిని వెంటనే చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యతో ప్రభు బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమస్య తీవ్రం కావడంతో మంగళవారం చెన్నైలోని కేలంబాక్కంలోని మెడ్‌వే ఆస్పత్రిలో చేర్పించారు. ప్రభును పరీక్షించిన వైద్యులు యూరిత్రోస్కోపీ లేజర్ సర్జరీ ద్వారా కిడ్నీలోని రాళ్లను తొలగించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. లేజర్ సర్జరీ ద్వారా కిడ్నీలో రాళ్లను తొలగించామని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. మరో రెండు రోజుల్లో ప్రభుని డిశ్చార్జి చేస్తామని వైద్యులు వెల్లడించారు. ప్రభు ఆసుపత్రిలో చేరారనే వార్త విన్న ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.తమ అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. ప్రభు అస్వస్థతకు గురైన విషయం తెలియగానే.. పలువురు సినీ ప్రముఖులు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి.. ధైర్యం చెప్పారు. ప్రభు ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Nude photo: మహబూబ్ నగర్ లో న్యూడ్ ఫోటోల కలకలం.. తాంత్రిక పూజలతో లైంగిక దాడి