Actor Naga Shourya Supports Darshan In Connection With Renuka Swamy Murder Case: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి పవిత్ర గౌడకి అసభ్యకరమైన సందేశాలు పంపగా దర్శన్ అండ్ కో అతడిని కిడ్నాప్ చేసి బెంగళూరు తీసుకొచ్చారు. ఆ తర్వాత పట్టనగెరెలోని ఓ షెడ్డులో హత్య చేసి అనంతరం మృతదేహాన్ని రాజ కాలువలో పడేశారనే ఆరోపణలు ఉన్నాయి. దర్శన్ ఆదేశాలతోనే ఇది జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు, ఆధారాలు ఉండడంతో ఈ కేసులో పవిత్ర గౌడ, దర్శన్‌తో పాటు మరో 17 మంది ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే ఈ కేసు వ్యవహారం జరిగి చాలా కాలమే అయినా ఎందుకో తెలుగు యువత రెండు మూడు రోజుల నుంచి దర్శన్ ను వదలకూడదు అంటూ విరుచుకుపడుతున్నారు. మరి అందుకు స్పందించాడో లేక ఎందుకు స్పందించాడో తెలియదు కానీ తెలుగు హీరో నాగశౌర్య సోషల్ మీడియా పోస్ట్ ఒకదాన్ని షేర్ చేస్తూ దర్శన్ కు మద్దతు పలికారు.
Kalki 2898 AD: ‘కల్కి’ రివ్యూ ఇచ్చిన లెక్కల మాస్టరు.. అసలు అదే హైలైట్ అంటూ!
శౌర్య పోస్ట్ చేసిన అంశం యధాతధంగా మీ కోసం ‘‘ఈ కష్టకాలంలో ఆ రేణుకాస్వామి కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ఈ ఘటనపై ప్రజలు ఒక్కసారిగా అంచనాలకు రావడం నిజంగా బాధాకరం. దర్శన్ అన్న కలలో కూడా ఎవరినీ ఇబ్బంది పెట్టడు. దర్శన్ ఉదారమైన, దయగల వ్యక్తి, ఇతరులకు సహాయ పడతాడు. దర్శన్ నిస్సహాయులకు సహాయం చేసారు, చాలా మందికి దర్శన్ బలం. నేను ఈ వార్తలను అంగీకరించలేను. మన న్యాయవ్యవస్థపై నాకు నమ్మకం ఉంది, వీలైనంత త్వరగా నిజం బయటకు వస్తుందని నమ్ముతున్నాను’’ అని నాగశౌర్య అన్నారు. “మరో కుటుంబం కూడా కష్టపడుతుందని మనం గుర్తుంచుకోవాలి. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆ కుటుంబానికి గోప్యత, గౌరవం అవసరం. కరుణకు పేరుగాంచిన దర్శన్ అన్న నిర్దోషి అని రుజువై, అలాగే న్యాయవ్యవస్థ అసలు దోషిని బయటకు తీసుకు వస్తుందని గట్టిగా నమ్ముతున్నాను’’ అని నాగశౌర్య అన్నారు.
అయితే ఈ కేసులో ఎలాంటి తీర్పు వస్తుందోనని అందరూ ఎదురుచూస్తున్నారు. నటుడు దర్శన్ జూలై 4 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉండనున్నారు. ఆ తర్వాత కేసులో ఏం జరుగుతుందో వేచి చూడాలి. అయితే గతంలో కూడా నటుడు దర్శన్ అనేక వివాదాలతో వార్తల్లో నిలిచాడు. కుటుంబ కలహాల కారణంగా నటుడు దర్శన్ 12 ఏళ్ల క్రితం కూడా జైలు పాలయ్యారు. ఒకరకంగా దర్శన్ కి కన్నడ నాట మరే హీరోతో పడదు. కిచ్చా సుదీప్ తో వివాదం కూడా అనేక సార్లు తెర మీదకు వచ్చింది. ఒకరకంగా బ్యాడ్ చాలా వరస్ట్ హిస్టరీ ఉన్న దర్శన్ ను నాగశౌర్యకి ఎలా వెనకేసుకు రావాలి అనిపించింది అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.