NTV Telugu Site icon

AartiRavi : విడాకులపై షాకింగ్ కామెంట్స్ చేసిన జయం రవి భార్య ‘ఆర్తిరవి’

Untitled Design (16)

Untitled Design (16)

కోలీవుడ్ స్టార్ట్ హీరో జయం రవి, సతీమణి ఆర్తితో విడాకులు తీసుకున్నట్టు ప్రకటించారు. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. ఇటీవల వీరివురి మధ్య మనస్పర్థలు రావడంతో వేరువేరుగా ఉంటున్నారు. కాగా రెండు రోజుల క్రితం తాము వీడిపోతున్నట్టు లేఖ విడుదల చేసాడు జయం రవి. ఈ నేపథ్యంలో ఈ రోజు జయం రవి వ్యాఖ్యలకు బదులుగా ఆయన భార్య ‘ఆర్తి రవి’ సంచలన లేఖ విడుదల చేసారు.

Also Read: VJS – Trisha : బ్లాక్ బస్టర్ సినిమాకు పార్ట్ – 2 రాబోతుంది.. షూటింగ్ ఎప్పుడంటే..?

ఆ లేఖలో ఆర్తి ” నాకు తెలియకుండా, అనుమతి లేకుండా మేము విడిపోతునట్టు జయం రవి బహిరంగ ప్రకటన చేయడంతో నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. 18 సంవత్సరాల భాగస్వామ్య జీవితం తర్వాత, అటువంటి ముఖ్యమైన విషయాన్ని నాకు చెప్పకుండా విడిపోతున్నట్టు ప్రకటించడం నన్ను ఎంతగానో బాధించింది.కొంత కాలంగా నా భర్తతో నేరుగా మాట్లాడటానికి అనేక సార్లు ప్రయత్నించాను. దురదృష్టవశాత్తూ, ఆ అవకాశం నాకు లభించలేదు, ఈ ప్రకటనతో నా పిల్లలు మరియు నేను షాక్ లో ఉన్నాం. మా వివాహం రద్దు చేసుకుని విడిపోవాలనే నిర్ణయం పూర్తిగాఏక పక్షంగా జరిగింది. ఇది మా కుటుంబానికి ప్రయోజనం కలిగించదు. ఈ సంఘటన మాకు ఎంతో భాద కలిగించినప్పటికీ, నేను గౌరవప్రదంగా ఉండాలని భావిస్తున్నాను. అందుకే ఇప్పటి వరకు పబ్లిక్ గా ఈ విషయం గురించి మాట్లాడలేదు.

అన్యాయంగా నాపై నిందలు వేసి, నన్నుక్యారక్టర్ ను తప్పుగా చూపిస్తూ వస్తున్నవార్తలు తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయి. ఒక తల్లిగా, నా మొదటి ప్రాధాన్యత మరియు ఎల్లప్పుడూ నా పిల్లల శ్రేయస్సు. ఈ సంఘటన నా పిల్లల జీవితంపై ప్రభావితం చేస్తుందేమో అనే భయం నాలో ఉంది. నా దృష్టి మా పిల్లల శ్రేయస్సుపైనే ఉంటుంది ఈ క్లిష్ట సమయంలో వాళ్ళని నేను కాపాడుకుంటాను. కాలక్రమేణా నిజాలేంటో అందరికి తెలుస్తాయని నేను భావిస్తున్నఇన్నాళ్లు మద్దతునిచ్చిన ప్రెస్, మీడియా మరియు మా ప్రియమైన అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ దయ మరియు ప్రేమ మాకు బలం.  మా జీవితంలోని ఈ  అధ్యాయంలో మీరు మా  పట్ల  గోప్యత వ్యవహరించడాన్ని నేను అభినందిస్తున్నాను” అని పేర్కొన్నారు.

Show comments