Darshan Jail Schedule: తన ప్రియురాలు పవిత్ర గౌడకు ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకరమైన సందేశాలు పంపిన చిత్రదుర్గ రేణుకా స్వామిని దారుణంగా హతమార్చిన కేసులో నటుడు దర్శన్ పరప్పన అగ్రహార జైలులో నెల రోజుల నుచి శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే ఇరవై రోజులుగా జైల్‌బ్రేక్‌కు అలవాటు పడకుండా, నిద్రలేని రాత్రులు గడుపుతున్న దర్శన్ ఒక్క క్షణం కూడా అక్కడ మనస్ఫూర్తిగా గడపలేక ఇబ్బంది పడుతున్నాడు. పార్టీలు, సినిమా షూటింగులతో ఉల్లాసంగా ఉండే దర్శన్.. ఇప్పుడు హఠాత్తుగా ఓ హత్య కేసులో నాలుగు గోడల మధ్య జైలు పాలయ్యాడు. ఈ క్రమంలోనే క్షణాలు కూడా డీ బాస్‌కు సంవత్సరాల వలె అనిపిస్తున్నాయట. రోజూ బిర్యానీ చికెన్ తినే శరీరం ఇప్పుడు ముద్ద పప్పు, పులుసు, చపాతీ, అన్నం, తినాల్సి వస్తోంది. జైలుకు అలవాటు పడక, తిన్న ఆహారం జీర్ణం కాకుండా ఫుడ్ పాయిజన్ అవుతోంది. వాంతులు, విరేచనాలు వల్ల బరువు తగ్గడం వంటి ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటున్నాడు దర్శన్.
Coconut: “కొబ్బరికాయల” కోసం వధూవరుల కుటుంబాల కొట్లాట..
ఈ కారణంగా దర్శన్ ఇంటి నుంచి భోజనం చేసేందుకు అనుమతించాలని దర్శన్ తరపు న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. ఇక ఇది ఒక అంశం అయితే జైల్లో దర్శన్ కి టైం పాస్ అవడం లేదు. దర్శన్ ప్రతి రోజు ఒక సంవత్సరం లాగా గడుపుతున్నాడు. అలా టైమ్ పాస్ చేయడానికి కొత్త అలవాటు చేసుకున్నాడు. అదేమిటంటే జైల్లో రోజూ మెడిటేషన్, భజన చేసేందుకు సిద్ధమయ్యారు. పరప్పన అగ్రహార జైలులో చేరిన తర్వాత దర్శన్ మారిపోయాడని అంటున్నారు. దినచర్య మాత్రమే కాదు, మాటతీరులోనూ, ప్రవర్తనలోనూ పూర్తి మార్పు కనిపిస్తుందట. ఉదయాన్నే ఫ్రీ ఎక్సర్ సైజ్, డిప్స్ చేస్తూ ఫిట్‌నెస్‌పై పెద్దపీట వేస్తున్న దర్శన్.. జైల్లో ఎవరితోనూ మాట్లాడటం లేదు. బదులుగా, అతను ఒక పుస్తకం చదువుతున్నాడని, సాయంత్రం హనుమాన్ చాలీసా చదువుతూ మంత్రాలూ జపిస్తున్నట్టు తెలుస్తోంది.