NTV Telugu Site icon

Kalki : ప్రభాస్, అమితాబ్ కు లీగల్ నోటిసులు..అసలేమైందంటే..?

Untitled Design (11)

Untitled Design (11)

ఇటీవల విడుదలైన ‘కల్కి 2898 AD’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కల్కి 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే. కాగా నిర్మాత అశ్వనీదత్, బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్, రెబల్ స్టార్ ప్రభాస్ కు కల్కి ధామ్ పీఠాధిపతి కల్కిఆచార్య ప్రమోద్ కృష్ణం లీగల్ నోటీసు జారీ చేశారు.

ఉత్తర్ ప్రదేశ్ కల్కి ధామ్ పీఠాధిపతి ఆచార్య ప్రమోద్ కృష్ణం కల్కి సినిమాపై విమర్శలు గుప్పించారు. “తల్లి (దీపికా)కు కృత్రిమ గర్భం ద్వారా కల్కి పుట్టబోతున్నట్టు చూపించడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్టే, హిందూ గ్రంధాలను ఇష్టానుసారంగా మార్చేసి చిత్రాలు తెరకెక్కించడం ఈమధ్య ఇదొక ఫ్యాషన్ అయిపోయింది” అని ఆచార్య ప్రమోద్ కృష్ణం అన్నారు. కల్కి చిత్రం సనాతన ధర్మానికి, హిందూ పురాణాలకు కించపరిచినట్టు ఉందని నోటీసులో పేర్కొన్నారు ఆచార్య ప్రమోద్ కృష్ణం. భారతదేశం “విశ్వాసం, భావోద్వేగాలు, ఆధ్యాత్మికతో కూడినది సనాతన ధర్మం, వాటి విలువలను మార్చకూడదు. సనాతన గ్రంథాలను మార్చకూడదు. కల్కి భగవానుడు విష్ణుమూర్తి చివరి అవతారంగా భావిస్తాం. పురాణాల్లో కల్కి అవతారం గురించి చాలా రాసి ఉంది. దాని ఆధారంగానే ప్రధాని మోదీ కల్కి ఆలయానికి శంకుస్థాపన చేశారు” అని కృష్ణం తెలిపారు.

మరోవైపు కల్కి సక్సెస్ ఫుల్ గా నాలుగవ వారంలోకి అడుగుపెట్టింది. అటు ఓవర్ సీస్ లో 18మిలియన్ల దాటి దూసుకెళుతుంది. తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం లాభాల బాటలో పయనిస్తోంది. ఇప్పటివరకు  అటు ఇటుగా రూ.100 కోట్లకు పైగా లాభాలు ఆర్జించారు నిర్మాత అశ్వనీదత్.