NTV Telugu Site icon

AAY : ఏంటి.. ఆయ్ సినిమా ఇంత కలెక్ట్ చేసిందా.. వామ్మో

Untitled Design (19)

Untitled Design (19)

ఆగస్టు 15న మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్, ఆయ్ వంటి తెలుగు సినిమాలతో పాటు తమిళ్ డబ్బింగ్ సినిమా తంగలాన్ కూడా టాలీవుడ్ ఆడియెన్స్ ను పలకరించాయి. వీటిలో మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు మిశ్రమ స్పందన తెచ్చుకున్నాయి. తంగలాన్ ఓ మోస్తరు టాక్ తెచ్చుకుంది. ఇక మూడు భారీ సినిమాల మధ్య చిన్న సినిమాగా విడుదలైన ఆయ్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఎటువంటి హంగామా లేకుండా వచ్చిన ఈ సినిమా మౌత్ టాక్ తో ప్రేక్షకులను థియేటర్ కు రప్పించగలిగింది.

Also Read: RamCharan: మెగా స్టార్ బర్త్ డే కానుకగా స్పెషల్ ఫోటో షేర్ చేసిన చరణ్

జూనియర్ ఎన్టీయార్ బావమరిది నార్నె నితిన్ హీరోగా గీతా ఆర్ట్స్ -2 బ్యానర్ పై  వచ్చింది ఆయ్.  ఆగస్టు 15న పెద్ద సినిమాలతో పోటీగా ఎందుకు కాస్త గ్యాప్ ఇచ్చి రిలీజ్ చేయమని అప్పట్లో నిర్మాతకు కొందరు  సూచించారు. కానీ అప్పటికే మరో చిన్న సినిమా అయిన కమిటీ కుర్రోళ్లు మంచి హిట్ సాధించడంతో కంటెంట్ బాగుంటే తప్పక ఆదరిస్తారని నిర్మాత బన్నీ వాసు నమ్మి దొరికినన్ని థియేటర్లలో విడుదల చేసారు. అయినా కూడా తొలివారం లో అన్ని చోట్లా కలిపి 9 కోట్ల 25 లక్షల గ్రాస్ వసూళ్లు సాధించి ఔరా అనిపించింది. మిగతా మూడు సినిమాలు మొదటి వారంతోనే థియేటర్ రన్ ముగించాయి. కానీ ఆయ్ సూపర్ కలెక్షన్స్ సాధించి విజయవంతంగా రెండవ వారంలో అడుగుపెట్టింది. ఈ మేరకు అధికారక పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. కథ, కథనం బాగుంటే చిన్న సినిమాలను టాలీవుడ్ ఆడియన్స్ ఆదరిస్తారని ఆయ్ హిట్ తో మరోసారి నిరూపించారు టాలీవుడ్ ప్రేక్షకులు.

Show comments