చదరంగానికి సిద్ధమంటోన్న ‘లాల్ సింగ్ చద్దా’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా చేస్తోన్న ఆమీర్ ఖాన్ లాక్ డౌన్ తరువాత మళ్లీ షూటింగ్ మొదలు పెట్టాడు. హాలీవుడ్ ఆల్ టైమ్ క్లాసిక్ ‘ఫారెస్ట్ గంప్’కి ‘లాల్ సింగ్ చద్దా’ అఫీషియల్ రీమేక్. అయితే, ప్రస్తుతం ఆమీర్ చేస్తోన్న సినిమా తరువాత ఆయన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటని ఎవరికీ క్లారిటీ లేదు. ఎటువంటి రూమర్స్ కూడా లేవు. అయితే, తాజాగా ఆయన ఆన్ లైన్ ఛాట్ ఒక దాంట్లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. పైగా ఆ కామెంట్స్ లో చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ పేరు కూడా ఉండటంతో నెటిజన్స్ ఆసక్తి మరింత పెరిగింది!
ఆమీర్ ఖాన్ కు చెస్ అంటే ఇష్టం. ఆయనకు విశ్వనాథన్ అనంద్ తోనూ మంచి అనుబంధం ఉంది. దాంతో ఒకటి రెండు సార్లు వారిద్దరూ ఫేస్ టూ ఫేస్ చెస్ గేమ్స్ ఆడారు కూడా! అయితే, లెటెస్ట్ గా జరిగిన ఓ ఆన్ లైన్ మీట్ లో మరికొందరు ప్రముఖులతో పాటూ వీరిద్దరు కూడా పాల్గొన్నారు. ఆ సమయంలో ‘విశ్వనాథన్ ఆనంద్ బయోపిక్’ చర్చకు రాగా… ఆమీర్ ఖాన్ ‘మరో ఆలోచన లేకుండా తాను వెండితెరపై విశ్వనాథన్ ఆనంద్ గా నటిస్తా’నని అన్నాడు! అంతే కాదు, ఆయన మైండ్ ఎలా పని చేస్తుందో అర్థం చేసుకోటానికిగానూ విశ్వనాథన్ తో వీలైనంత ఎక్కువ సేపు గడుపుతానని పేర్కొన్నాడు. ఆయన భార్యని, కుటుంబ సభ్యుల్ని కూడా సంప్రదించి చెస్ గ్రాండ్ మాస్టర్ రోజు వారీ ప్రవర్తన ఎలా ఉంటుందో అధ్యయనం చేస్తానని ఆమీర్ చెప్పాడు. విశ్వనాథన్ ఆనంద్ తన పాత్రని తాను బిగ్ స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఆశ్చర్యపోయేలా నటించే ప్రయత్నం చేస్తానని పర్పెక్షనిస్ట్ అన్నాడు.
విశ్వనాథన్ ఆనంద్ బయోపిక్ అనగానే ఆమీర్ ఉత్సాహం చూపటం, తాను ఎలా ప్రిపేర్ అవుతాడో కూడా చెప్పటం… ఇదంతా అప్ కమింగ్ ప్రాజెక్ట్ కోసమేనంటున్నారు కొందరు ఆన్ లైన్ అబ్జర్వర్స్. చూడాలి మరి, చదరంగ వీరుడిగా ఆమీర్ ఎలాంటి ఎత్తులు, పైఎత్తులు వేసి సినిమాని రక్తి కట్టిస్తాడో…
Also Read
- Peddi : 'పెద్ది' ఐటం సాంగ్.. ఏదో అనుకుంటే ఇంకేదో అయింది
- Tollywood : మెగాస్టార్ చిరంజీవితో ముగిసిన ఎగ్జిబిటర్ల సమావేశం.. గిల్డ్ నిర్మాతల ప్రతినిధులకు పిలుపు
- Ram Charan: శివన్నతో యాక్ట్ చేయడం నా జన్మ ధన్యం.. రెండూన్నరేళ్ల కష్టానికి ఫలితం ‘పెద్ది’ : రామ్ చరణ్
- Tollywood : నందమూరి బాలకృష్ణకు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అభినందనలు
తాజావార్తలు
-
Water Tank Cleaning : వాటర్ ట్యాంక్లో చేపల వాసన వస్తోందా? ఈ ట్రిక్ ట్రై చేయండి.!
-
Peddi : ‘పెద్ది’ ఐటం సాంగ్.. ఏదో అనుకుంటే ఇంకేదో అయింది
-
ASUS VM441 AiO: ఆసుస్ నుంచి కొత్త AI డెస్క్టాప్.. ఆసుస్ VM441 AiO భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Family Planning : ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ఈ టెస్టులు మస్ట్!
-
Vaibhav Vs Jaiswal: వైభవ్ సూర్యవంశీ వల్లే జైస్వాల్ ఫ్లాప్.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?