‘కిరాతక’గా ఆది సాయికుమార్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లవ్‌లీ రాక్‌స్టార్ ఆది సాయికుమార్ హీరోగా ప్రముఖ దర్శకుడు ఎం. వీరభద్రం దర్శకత్వంలో ఓ భారీ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని విజన్ సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.3గా ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కిరాతక అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ మూవీలో ఆది సాయికుమార్ సరసన హీరోయిన్‌గా పాయల్ రాజ్‌పూత్ నటిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఎం. వీరభద్రం మాట్లాడుతూ ఆది కుమార్ హీరోగా నా దర్శకత్వం వచ్చిన 'చుట్టాలబ్బాయి' చక్కని విజయాన్ని అందుకుంది. మరోసారి మా ఇద్దరి కాంబినేషన్‌లో అద్భుతమైన సినిమా రాబోతుంది. స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యింది. ఆది సరసన పాయల్ రాజ్‌పూత్ హీరోయిన్‌గా నటిస్తుంది. విజన్ సినిమాస్ పతాకంపై నాగం తిరుపతిరెడ్డి గారు అన్‌కాంప్రమైజ్‌డ్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం, అలాగే రామ్‌రెడ్డి గారి విజువల్స్ తప్పకుండా సినిమాకి ప్లస్ అవుతాయి అన్నారు. చిత్ర నిర్మాత డా. నాగం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ”డిఫరెంట్ కాన్సెప్ట్‌తో డైరెక్టర్ వీరభద్రం గారు చెప్పిన కథ బాగా నచ్చింది. అతి త్వరలో షూటింగ్ ప్రారంభించబోతున్నాం“ అన్నారు.

Also Read
- Johnny Master - Sekhar Master: టాలీవుడ్లో కలకలం.. జానీ మాస్టర్ - శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం! వీడియో వైరల్
- Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే డ్రీమ్ రోల్ ఇదేనట.. రాజమౌళి పేరు చెప్పి షాకిచ్చిన హీరోయిన్!
- Tollywood Directors: కథలు రెడీ.. హీరోలే మిస్సింగ్! టాలీవుడ్ హిట్ డైరెక్టర్లకు కొత్త టెన్షన్..
- Maa Inti Bangaram: 100 కోట్ల క్లబ్లో 'మా ఇంటి బంగారం'.. తెలుగు సినీ చరిత్రలో సమంత రేర్ ఫీట్..
తాజావార్తలు
-
Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
-
AP CM Chandrababu: ముంబైలో పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు..
-
Shabad Murders : షాబాద్ హంతకుడు రాజ్‌కుమార్ వేటలో విస్తుపోయే నిజాలు
-
Johnny Master – Sekhar Master: టాలీవుడ్లో కలకలం.. జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం! వీడియో వైరల్
-
Khamenei Funeral: ఖమేనీ అంత్యక్రియల్లో “మాస్క్ మ్యాన్”.. ఎవరనేది తెలిసింది
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..