NTV Telugu Site icon

AAA Cinemas: అల్లు అర్జున్ థియేటర్ లాంఛ్ ఆ రోజే.. ఎవరి చేతుల మీదుగా అంటే?

Aaa Cinemas Allu Arjun

Aaa Cinemas Allu Arjun

AAA Cinemas to be Launched on June 15th : రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు, రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నందమూరి బాలకృష్ణ మాదిరిగానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ రంగంలోకి అడుగు పెడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్ లో బి డబ్స్ బఫెలో వైల్డ్ వింగ్స్ పేరుతో ఒక రెస్టారెంట్ ఫ్రాంచైజ్, 800 జూబ్లీ అనే పబ్ ను బన్నీ విజయవంతంగా నడుపుతున్నాడు. ఇక ఆయన హైదరాబాద్ లోని అమీర్పేట్ లో ఒకప్పుడు సత్యం థియేటర్ ను కూల్చేసిన స్థలంలో ఏషియన్ సంస్థతో కలిసి అల్లు అర్జున్ పేరు మీద ఒక మల్టీప్లెక్స్ నిర్మాణం మొదలు పెట్టగా అది పూర్తయ్యింది.

Also Read: Manchu Lakshmi : డిజైనర్ డ్రెస్ లో క్లివేజ్ షో చేస్తున్న మంచు లక్ష్మీ

ఏషియన్ సినిమాస్ -అల్లు అర్జున్ పేరు వచ్చేలా AAA సినిమాస్ అని పేరు పెట్టగా జూన్ 15 న ఈ మల్టీప్లెక్స్ తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా ఓపెన్ కానుంది. ఏషియన్ సత్యం మాల్‌ను జూన్ 15న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అల్లు అర్జున్ ప్రారంభించనున్నారని అంటూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. ఈ మాల్ లో అల్లు అర్జున్, ఏషియన్ సునీల్ నారంగ్, భరత్ నారంగ్, మురళీ మోహన్ సహా సదానంద్ గౌడ్ ఏషియన్ సత్యం మాల్లో భాగస్వాములు. 3 లక్షల చదరపు అడుగులు వైశాల్యం గల ఈ మాల్ లో కార్ పార్కింగ్ కోసం 3 అంతస్తులు ఉన్నాయి. మాల్ మూడవ అంతస్తులో AAA ఫుడ్ కోర్ట్, 4వ అంతస్తులో AAA సినిమా థియేటర్లు ఉంటాయి. ఇక AAA ఫుడ్ కోర్ట్ లో హల్దీరామ్, కృతుంగా, పిస్తా హౌస్, ఫస్ట్ పొపాయెస్ చికెన్ ఈ ఫుడ్ కోర్ట్‌లో మరో ఆకర్షణగా నిలవబోతోంది.

Also Read: Adipurush: ‘ఆదిపురుష్’ టికెట్ రేట్లు పెంచండి ప్లీజ్.. ఏపీ సీఎంను కోరనున్న నిర్మాతలు?

AAA సినిమాస్‌ ప్రత్యేకతలు:

AAA సినిమాస్‌లో మొత్తం 5 స్క్రీన్‌లు ఉన్నాయి. స్క్రీన్ 1 67 అడుగుల ఎత్తు, ATMOS సౌండ్‌తో బార్కో లేజర్ ప్రొజెక్షన్ తో ఉంటుంది. స్క్రీన్ 2 ATMOS సౌండ్‌తో కూడిన EPIQ లక్సన్ స్క్రీన్. మిగిలిన స్క్రీన్‌లు 4K ప్రొజెక్షన్‌ను కలిగి ఉంటాయి, అలాగే అన్ని స్క్రీన్‌లు డాల్బీ 7.1 సౌండ్‌తో అమర్చబడి ఉంటాయి. జూన్ 14వ తేదీన పూజా కార్యక్రమాలు నిర్వహించి, 15వ తేదీన మాల్, సినిమా థియేటర్లు, ఫుడ్‌కోర్టులను తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అల్లు అర్జున్ స్వయంగా ప్రారంభించనున్నారు. ఇక మరికొంత మంది అతిథులు హాజరయ్యే ఈ గ్రాండ్ ఓపెనింగ్ వేడుకకు ఈ ప్రాజెక్ట్ భాగస్వాములందరూ కూడా హాజరుకానున్నారు. ఇక ఓపెనింగ్ తరువాత జూన్ 16 న మొట్టమొదటి స్క్రీనింగ్ గా ఆదిపురుష్ ఉండనుందని తెలుస్తోంది.

 

Show comments