NTV Telugu Site icon

Vicky Kaushal : బాలీవుడ్ రియల్ స్టార్ గా మారిన యంగ్ హీరో

Vicky Kaushal

Vicky Kaushal

బాలీవుడ్ లో ఈ జనరేషన్ లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాప్ హీరోగా రాణించడం చాలా కష్టం. కానీ ఆ కష్టాన్ని ఇష్టంగా మలుచుకున్న నటుడు విక్కీ కౌశల్. క్రేజీ కుర్రాడి నుండి ఇప్పుడు సెటిల్డ్ ఫెర్మామెన్స్ తో తన కెరీర్ ను స్టాంగ్ గా డెవలప్ చేసుకుంటున్నాడు. ముఖ్యంగా రియల్ స్టోరీలకు ప్రాణం పోసేస్తున్నాడు. ఉరి నుండి రీసెంట్లీ వచ్చిన చావా వరకు చూస్తే విక్కీ నటుడిగా ఆ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయడం చూస్తుంటే వాట్ ఎ మెథడార్టిస్ట్ అనకుండా ఉండలేరు.

Also Read : Mani Sharma : చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో రక్తదానం చేసిన మణిశర్మ

విక్కీ కెరీర్ గురించి చెప్పుకోవాలంటే ‘ఉరి’కి ముందుకు  ‘ఉరి’క తర్వాత. హీరోపై ఫ్యాన్స్ పర్స్పెక్టివ్ మార్చేసిన సినిమా. అందులో మేజర్ గా ఎక్స్ లెంట్ ఫెర్మామెన్స్ చూపించాడు. అలాగే  సర్దార్ ఉద్దమ్ లో ఉద్దమ్ సింగ్ క్యారెక్టర్ కోసం తనను తాను మలుచుకున్నాడు విక్కీ. ఈ సినిమా కోసం 14 కేజీలు తగ్గి వావ్ అనిపించాడు. అలాగే సామ్ బహుదూర్ సినిమాలో మార్షల్ శ్యామ్ మానెక్ షా కోసం ఎంతో ప్రిపరేషన్ తీసుకున్నాడు. ఈ కష్టపడే తత్వమే అతడ్ని స్టార్ హీరోను చేసింది. రీసెంట్లీ వచ్చిన హిస్టారికల్ పిక్చర్ ‘చావా’లో ఛత్రపతి శివాజీ కొడుకు శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్ ను తప్ప మరొకరిని ఊహించలేని పరిస్థితి. ఇలా నిజ జీవిత కథల ఆధారంగా హిట్స్ అందుకోవడమే కాకుండా అభిమానులతో రియల్ స్టార్ అని పిలిపించుకుంటున్నాడు విక్కీ. రానున్న రోజుల్లో బయోపిక్ లే కాకుండ ఇతర జనర్స్ లో సినిమాలు చేసి హిట్స్ కొట్టాలని కోరుతున్నారు.