Site icon NTV Telugu

Bollywood : 68 ఏళ్ల వయసులో కూడా అదరగొడుతున్న స్టార్ హీరో

Bollywood (1)

Bollywood (1)

బాలీవుడ్‌లో యాక్షన్‌కి సింబల్‌ అంటే సన్నీ డియోల్.. గతేడాది గదర్ 2 తో రికార్డులు తిరగరాశాడు… ఆ తర్వాత జాట్ తో పర్వాలేదనిపించుకున్నాడు .. ఇప్పుడు 68 వ ఏట కూడా అదే జోష్‌, అదే పవర్ చూపిస్తున్నాడు. దేశభక్తి అంటే సన్నీ డియోల్.. “బార్డర్ 2”తో మళ్లీ ఆ స్పిరిట్‌ను రీక్రియేట్ చేయబోతున్నాడు. 1997లో బార్డర్ సినిమా ప్రేక్షకుల్లో దేశ భక్తిని మేల్కొలిపింది. ఇప్పుడు “బార్డర్ 2”లో మరోసారి సైనికుడి ఆత్మ గర్జించబోతోంది. “జైహింద్!” అంటూ సన్నీ డైలాగ్ మళ్లీ దేశమంతా మార్మోగబోతోందని అభిమానులు ఎగ్జైట్ అవుతున్నారు.  మరొక వైపు రామాయణ 1లో మాత్రం సన్నీ డియోల్‌ హనుమంతుడి పాత్రను పోషిస్తున్నాడు.

Also Read ; Dhruv : నాకు తెలుగులో నటించాలని ఉంది..

ఈ ప్రాజెక్ట్ మొదటి భాగంలో అతని పాత్ర పరిమితంగా ఉన్నప్పటికీ, రెండవ భాగంలో అతని పాత్ర గణనీయంగా విస్తరించబడుతుందని సమాచారం. మైథాలజీ, యాక్షన్, విజువల్ గ్రాండర్, ఈ మూడింటిని మిక్స్ చేస్తూ రూపొందుతున్న ఈ సినిమా భారతీయ ఇతిహాసం రామాయణానికి కొత్త డైమెన్షన్ ఇవ్వబోతోంది. సన్నీ డియోల్‌ లాంటి పవర్‌ యాక్టర్‌కు ఈ రోల్‌ పర్ఫెక్ట్ ఫిట్ అని ఇండస్ట్రీ టాక్‌. “లాహోర్ 1947” — భారత విభజన నేపథ్యంలో జరిగే హృదయానికి హత్తుకునే భావోద్వేగ కథ. ధర్మేంద్ర ప్రొడక్షన్‌, రాజ్‌కుమార్ సంతోషి డైరెక్షన్‌లో రూపొందుతోంది ఈ సినిమా. భారత, పాకిస్థాన్ విభజనలో చీలిన మనుషుల మనసుల బాధను చూపించే ఈ కథలో సన్నీ డియోల్‌ ఎమోషన్‌, ఇన్‌టెన్సిటీ ప్రధాన ఆకర్షణగా నిలవబోతోందని బి టౌన్ లో వినిపిస్తున్న టాక్. బార్డర్‌ నుంచి లాహోర్‌ వరకు, రామాయణ‌ నుంచి గబ్రు వరకు సన్నీ డియోల్‌ చూపిస్తున్నది కేవలం యాక్షన్ కాదు… శక్తి, ఆత్మవిశ్వాసం, దేశభక్తి.. మరొక్క సారి అతని మాటల్లో చెప్పాలంటే “శక్తి అంటే నువ్వు చూపించేది కాదు, నువ్వు చేసేది!”

Exit mobile version