బాలయ్య కొడుకు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని నందమూరి ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నారు. అదిగో ఇదిగో అని గత నాలుగైదు ఏళ్లుగా ఊరిస్తూనే ఉన్నారు తప్ప ఎంట్రీ ఇవ్వలేదు. ఇటీవల మోక్షజ్ఞ ఎంట్రీఫై రాకరాకాల వార్తలు వినిపించాయి. ప్రశాంత్ వర్మ మోక్షుని లాంఛ్ చేయబోతున్నాడు, బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని నిర్మాతగా వ్యవహరిస్తోంది అని అనేక ఊహాగానాలు వచ్చాయి. కానీ అధికారకంగా ప్రకటించలేదు.
Also Read: Nani : 1 మిలియన్ బుకింగ్స్ దాటేసిన సరిపోదా.. సక్సెస్ మీట్ శనివారం..
తాజాగా వాటన్నిటిని నిజం చేస్తూ దర్శకుడు ప్రశాంత్ వర్మ చేసిన ట్వీట్ చేసాడు. తన వ్యక్తిగత ‘X’ లో బాలయ్య ముద్దుల తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ నుద్దేశిస్తూ ‘సింబా ఈజ్ కమింగ్’ హాష్ ట్యాగ్ జత చేసి సింబా లోని పోస్టర్ ను పోస్ట్ చేసాడు. ఈ పోస్ట్ సొషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సెప్టెంబరు 6న మోక్షజ్ఞ పుట్టిన రోజు. ఆరోజు అధికారకంగా ప్రకటిస్తారని సమాచారం. హనుమాన్ సినిమాగా మాదిరిగానే బాలయ్య కొడుకు సినిమా కూడా మైథలాఙికల్ టచ్ తో సోషియో ఫాంటసీ నేపథ్యంలో సాగుతుందని సమాచారం. నందమూరి కుటుంబానికి చెందిన రామకృష్ణ సినీ స్టూడియోస్ లో ఈ చిత్రం యొక్క పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో బాలయ్య కృష్ణుడి పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. సినిమా చివర 20 నిమిషాలు మాములుగా ఉండదని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం మోక్షు వైజాగ్ లో సత్యానంద్ వద్ద నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు. అటు డాన్స్, గుర్రపు స్వారీ లోను మోక్షజ్ఞ శిక్షణ తీసుకుంటున్నాడు.
A new dawn is breaking at @ThePVCU!#SimbaisComing 🦁 pic.twitter.com/Kr91AkRil2
— Prasanth Varma (@PrasanthVarma) September 3, 2024