టాలీవుడ్ సినిమాకు రెండు తెలుగు స్టేట్స్ తో పాటు సమానంగా వసూళ్లు రాబట్టే ప్లేస్ అంటే ఓవర్సీస్ అనే చెప్పాలి. కొన్ని సినిమాలైతే తెలుగు స్టేట్స్ ని మించి భారీ వసూళ్లు ఓవర్సీస్ లో రాబట్టిన రోజులు ఉన్నాయి. ఇక స్టార్ హీరోలకు ఇండియాన్ మార్కెట్ తో పాటు ఓవర్సీస్ వసూళ్లు కూడా చాలా ముఖ్యం. నార్త్ అమెరికాలో మిలియన్ వసూళ్లు వస్తుంటాయి. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ లోనే మిలియన్ కలెక్షన్స్ రాబట్టి మేజర్ కాంట్రిబ్యూట్ చేస్తుంటాయి.
Also Read : Nivetha Pethuraj : కాబోయే భర్తను పరిచయం చేసిన ‘నివేద పేతురేజ్’.. ‘లక్కీ బాయ్’
కాగా ఇప్పడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ OG మరికొద్ది రోజుల్లో రిలిజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో USA లో అడ్వాన్సు బుకింగ్స్ ఓపెన్ చేసారు. ఓవరాల్ గ 3 లొకేషన్స్ లో 46 షోస్ కు గాను 2845 టికెట్స్ తో $82,681 కలెక్ట్ చేసింది. అయితే ఓవర్సీస్ లో అడ్వాన్స్ సేల్స్ లో ఫాస్టెస్ట్ 100K రికార్డును OG కొద్దిలో మిస్ చేసుకుంది. ఈ రికార్డ్ ఇప్పటివరకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరిట ఉంది. ఎన్టీఆర్ నటించిన దేవరా USA ప్రీమియర్ ప్రీ-సేల్స్ లో కేవలం 12 గంటల్లో $100K వసూలు చేసి అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఇప్పటికీ ఇది ఆల్ ఇండియా ఆల్ టైమ్ రికార్డ్ గా ఉంది. ఇక ఇప్పట్లో ఈ రికార్డ్ ను బద్దలు కొట్టే సినిమా లేదనే చెప్పాలి. ఇక పవర్ స్టార్ లేటెస్ట్ సినిమా OG రిలీజ్ నాటికి అడ్వాన్స్ బుకింగ్స్ లో 1 మిలియన్ రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ అంచనా వేస్తుంది.
