భారతీయ చిత్రసీమలో సరికొత్త రికార్డులను సృష్టించి, తమదైన మార్క్ విజన్‌తో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న ఇద్దరు దిగ్గజ దర్శకులు ఇప్పుడు చేతులు కలపబోతున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్. శంకర్ మరియు మాస్ కమర్షియల్ డైరెక్టర్ ఎ. ఆర్. మురుగదాస్ కాంబినేషన్‌లో ఒక అత్యంత భారీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఈ బిగ్గెస్ట్ కొలాబరేషన్‌లో రాబోయే ఈ భారీ చిత్రానికి ఎ. ఆర్. మురుగదాస్ పవర్‌ఫుల్ కథను అందించనుండగా, దర్శకుడు శంకర్ దర్శకత్వంలో బిగ్ స్క్రీన్‌పై ఆవిష్కరించనున్నారు. ఇద్దరూ సామాజిక అంశాలను, స్ట్రాంగ్ మెసేజ్‌ను భారీ విజువల్స్‌తో కమర్షియల్‌గా చూపించడంలో దిట్ట. ఒకరు అందించే బలమైన స్క్రిప్ట్, కథనానికి మరొకరి అత్యున్నత మేకింగ్ మరియు విజువల్స్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డుల తుఫాను ఖాయమని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత కొంతకాలంగా సరైన విజయం కోసం చూస్తున్న ఈ ఇద్దరు మాస్టర్ మైండ్స్.. స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలనే లక్ష్యంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇద్దరు ఇండియన్ బిగ్గెస్ట్ డైరెక్టర్లు ఒకే ప్రాజెక్ట్ కోసం చేయి కలపడం అనేది అత్యంత అరుదైన విషయమైనందున, ఈ కాంబోపై ఆడియెన్స్ లో కాస్త మంచి అంచనాలే ఉన్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇందులో నటించబోయే కాస్టింగ్ మరియు ప్రొడక్షన్ వివరాలపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరి ఈ సినిమాతో శంకర్ సాలిడ్ కంబ్యాక్ ఇస్తాడా అనేది చూడాలి.

