ఇండియన్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయనక్కర్లేని బ్యూటీ టబు. 90స్‌లో కుర్రాళ్ల క్రష్‌గా మారిన బ్యూటీ 50 ప్లస్ క్రాసైనా ఇప్పటికీ అదే అందం, అదే గ్లామర్ తో యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తోంది. యాభై ఏళ్ల వయస్సులో కూడా యంగ్ హీరోయిన్లను తలదన్నేలా గ్లామర్ మెయిన్ టైన్ చేస్తోంది. ఇప్పటికీ హీరోయిన్‌గా ఆఫర్లు కొల్లగొడుతూ ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అని నిరూపిస్తోంది. 34 ఇయర్స్ కెరీర్‌లో ఎక్కడ గ్యాప్ తీసుకోకుండా యాక్ట్ చేసిన ఈ సీనియర్ బ్యూటీ అదే గ్లామర్ మెయిన్ టైన్ చేయడంతో ఇప్పటికీ కూడా హీరోయిన్‌గా, మెయిన్ యాక్ట్రెస్‌గా ఫుల్ బిజీగా ఉంది.
Also Read : Sundar C : మరో సినిమాను రిలీజ్ చేస్తున్న సుందర్. సి
అక్షయ్ కుమార్ భూత్ బంగ్లాలో నటిస్తోంది టబు. రీసెంట్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టింది ఈ స్టార్ హీరోయిన్. హేరా పేరీ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ తర్వాత కలిసి ఈ జంట మరోసారి యాక్ట్ చేస్తున్నారు. సుమారు 25 ఏళ్ల తర్వాత భూత్ బంగ్లాతో సెకండ్ టైం ఈ హిట్ పెయిర్ జోడీ కడుతున్నారు. మలయాళ స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ 15 ఏళ్ల గ్యాప్ తర్వాత అక్షయ్ కుమార్‌తో సినిమా చేస్తున్నాడు. బాలాజీ టెలీ ఫిల్మ్స్ పతాకంపై శోభా కపూర్, ఏక్తా కపూర్, అక్షయ్ కుమార్ ప్రొడక్షన్ హౌజ్ సంయుక్తంగా నిర్మిస్తోంది. హారర్ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ మూవీ ప్రజెంట్ జైపూర్‌లో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 2న రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఆచితూచి సినిమాలు చేస్తున్న ఈ స్టార్ హీరోయిన్ తెలుగులో అల వైకుంఠపురం తర్వాత మరో సినిమా చేయలేదు.