71st National Film Awards: 2025 ’71 వ జాతీయ చలనచిత్ర అవార్డుల’ ప్రధానోత్సవ కార్యక్రమం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో అట్టహాసంగా జరుగుతోంది. 2023కి గానూ కేంద్రం ఉత్తమ చిత్రాలు, నటులు, సాంకేతిక నిపుణులను ఇటీవల ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. సౌత్, నార్త్ ఇండస్ట్రీస్ కి చెందిన అవార్డు విజేతలు ఈ వేడుకలో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో 2025 సంవత్సరానికి సంబంధించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన సినిమాలకు, నటీనటులకు జాతీయ పురస్కారాలు అందజేస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విజేతలకు అవార్డులు ప్రధానం చేస్తున్నారు. ఈ ఏడాది బాలీవుడ్ చిత్రం 1’2th’ ఉత్తమ జాతీయ చిత్రంగా ఎంపికైంది. ఇందులో హీరోగా నటించిన విక్రాంత్ మసాయ్ ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డులు గెలుచుకున్నారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జవాన్ ‘ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు.
Also Read :They Call Him OG: ఓజీ డిస్ట్రిబ్యూషన్ ఒక టార్చర్.. యూరప్ డిస్ట్రిబ్యూటర్ సంచలన ప్రకటన
అవార్డులు అందుకున్న వారు వీరే
ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి
ఉత్తమ బాలనటిగా సుకుమార్ కూతురు సుకృతివేణి (గాంధీతాత చెట్టు )
యానిమేషన్, గేమింగ్ అండ్ కామిక్ విభాగంలో..
హనుమాన్ సినిమాకు ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ అవార్డు
ఊరూ పల్లెటూరు(బలగం) పాటకు బెస్ట్ లిరిక్స్ అవార్డు
బేబీ సినిమాకు బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు
రోహిత్ కు బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్ అవార్డు
జాతీయ ఉత్తమ నటులుగా షారూఖ్ ఖాన్, విక్రాంత్
జాతీయ ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ
జాతీయ ఉత్తమ చిత్రంగా 12thఫెయిల్ (హిందీ)
