Site icon NTV Telugu

`భీష్మ‌`ను క్రాస్ చేసేసిన `రంగ్ దే`!

7.22 trp rating for rang de movie Television Premiere

అ ఆ మూవీ త‌ర్వాత నితిన్ కెరీర్ లో మ‌రో చ‌క్క‌ని విజ‌యాన్ని అందుకున్న సినిమాభీష్మ‌నే. ఎన్నో ప‌రాజ‌యాల త‌ర్వాత త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన అ ఆ నితిన్ కెరీర్ కు కొత్త ఊపిరి పోసిన‌ట్టుగా, లై, చ‌ల్ మోహ‌న్ రంగ‌, శ్రీనివాస క‌ళ్యాణం చిత్రాల ప‌రాజ‌యం త‌ర్వాత నితిన్ కు భీష్మ‌ మంచి విజ‌యాన్ని అందించి, అత‌ని ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆ త‌ర్వాత ఈ యేడాది వ‌చ్చిన చెక్, రంగ్ దే చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడ‌లేదు. కానీ చిత్రం ఏమంటే… భీష్మ‌ను ఓ విష‌యంలో రంగ్ దే మూవీ క్రాస్ చేసేసింది.

Read Also : `ఆహా` వీక్ష‌కుల‌కు ఇవాళ పండ‌గే పండ‌గ‌!

ఆ మ‌ధ్య భీష్మ‌ సినిమాను జెమినీ ఛానెల్ లో ప్ర‌సారం చేస్తే, 6.65 టీఆర్పీ వ‌చ్చింది. కానీ ఇటీవ‌ల రంగ్ దే ను జీ తెలుగు ఛానెల్ లో ప్ర‌సారం చేస్తే ఏకంగా 7.22 టీఆర్పీ రావ‌డం విశేషం. నిజానికి ఈ సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌లైన త‌ర్వాత వెంట‌నే జీ 5 యాప్ లోనూ స్ట్రీమింగ్ అయింది. అయినా కూడా జీ తెలుగు ఛానెల్ లో ప్ర‌సారం అయిన‌ప్పుడు ఆ రేటింగ్ రావ‌డం అంటే గ్రేట్ అంటున్నారు విశ్లేష‌కులు. సో… వీక్ష‌కుల‌లో భీష్మ‌ కంటే రంగ్ దే పైనే ఆస‌క్తి ఉంద‌ని అనుకోవాలి. మ‌రి ఈ యేడాది ఇప్ప‌టికే నితిన్ న‌టించిన రెండు సినిమాలు విడుద‌ల‌య్యాయ‌.. మ‌రి రాబోయే మాస్ట్రోతో ఏ స్థాయి విజ‌యాన్ని నితిన్ అందుకుంటాడో చూడాలి.

Exit mobile version