Site icon NTV Telugu

3BHK: ప్రతి ఇంటి కథ.. ప్రతి ఒక్కరి కల .. కనీళ్ళు తెప్పించేలా 3BHK ట్రైలర్

3bhk

3bhk

మధ్యతరగతి కుటుంబాల జీవితాల్లోని స్వప్నాలు, ఆశలు, ఆవేదనలను హృదయానికి హత్తుకునేలా సిద్ధార్థ్ ‘3 BHK’ ట్రైలర్ కట్ చేశారు.. సిద్ధార్థ్ నటిస్తున్న 40వ చిత్రంగా రూపొందిన ఈ సినిమా, శ్రీ గణేష్ దర్శకత్వంలో శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ నిర్మించారు. ఈ రోజు విడుదలైన ఈ చిత్ర ట్రైలర్, ప్రేక్షకుల హృదయాలను కదిలించేలా ఒక ఎమోషనల్ జర్నీలా అనిపించింది. ఒక సామాన్య కుటుంబం సొంత ఇల్లు కొనాలనే జీవన్మరణ కల చుట్టూ ఈ సినిమా తిరుగుతుందని ట్రైలర్ తో క్లారిటీ వచ్చింది. జీవితంలో అనేక నిరాశలు, వైఫల్యాలను ఎదుర్కొన్న ఒక తండ్రి, తన కుటుంబ ఆశలన్నీ తన కొడుకుపై పెట్టుకుంటాడు. కానీ, 34 ఏళ్ల వయస్సులోనూ ఉద్యోగం లేక, చదువులో వెనుకబడిన ఆ కొడుకు, ఈ కథలో కీలకమైన వ్యక్తిగా నిలుస్తాడు. ఈ కుటుంబం తమ కలను సాకారం చేసుకుంటుందా అనే ప్రశ్నే ఈ సినిమా కథ. మధ్యతరగతి జీవితాల్లో సొంత ఇల్లు కొనుగోలు చేయడం అనేది కేవలం ఆర్థిక లక్ష్యం మాత్రమే కాదు, అది గౌరవం, స్థిరత్వం, సంతృప్తికి చిహ్నం. దర్శకుడు శ్రీ గణేష్ తన భావోద్వేగపూరిత రచన, ఆకట్టుకునే కథనంతో ఈ కథను అద్భుతంగా తీర్చిదిద్దారనే అనిపిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక లుక్ వేయండి మరి .
YouTube video player

Exit mobile version