NTV Telugu Site icon

Rana Daggubati : నివేతా థామస్, ప్రియదర్శిల మధ్య ఎం జరిగిందో తెలుసా..?

Untitled Design (9)

Untitled Design (9)

రానా దగ్గుబాటి సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ నిర్మించిన చిత్రం ’35-చిన్న కథ కాదు’.  నివేతా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి మరియు భాగ్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన  క్లీన్ ఫ్యామిలీ డ్రామా 35. నంద కిషోర్ ఈమని రచన మరియు దర్శకత్వం వహించాడు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర  టీజర్, పాటలు, ఇతర ప్రోమోలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సరికొత్త కథాంశంతో రాబోతున్నట్టు ట్రైలర్ చుస్తే తెలుస్తోంది.

Also Read: Priyadarshi : జాతకం చెప్పబోతున్న ప్రియదర్శి.. మీ పెళ్లి ఎప్పుడో తెలుసుకోండి..

వాస్తవానికి ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అదే రోజు మూడు భారీ బడ్జెట్ చిత్రాలు వస్తుండడంతో  స్టార్ హీరోల సినిమాల మధ్య పోటీ ఎందుకని రేస్ నుండి తప్పుకుంది.  నేడు ఈ చిత్ర హీరో ప్రియదర్శి బర్త్ డే సందర్భంగా  మరొక  రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. 35-చిన్న కథ కాదు ను సెప్టెంబరు 6న వరల్డ్ వైడ్  గా థియేటర్లలోకి తీసుకువస్తున్నట్టు అధికారకంగా ప్రకటించారు. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ మేరకు మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను జెట్ స్పీడ్ లో నిర్వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాని ఎంపిక చేసిన అతి కొద్దిమందికి ప్రీమియర్ ప్రదర్శించగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.  ఈ సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతుందని నమ్ముతోంది యూనిట్. గ్రామీణ నేపధ్యంలో  వస్తోన్న ’35-చిన్న కథ కాదు’ హాస్యం మరియు భావోద్వేగమైన కథాంశంతో, అర్ధవంతమైన  సందేశంతో రాబోతున్న ఈ  సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందించగా  సురేష్ మూవీస్ సంస్థ పంపిణి చేస్తోంది.