321 Movie: మైండ్ బ్లాంక్ చేసే కాన్సెప్ట్‌తో ‘321’.. సెన్సేషన్‌గా ‘నను తాకిన’ సాంగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెళ్లి అనగానే నేటితరం యువతలో మొదలయ్యే అతిపెద్ద కన్ఫ్యూజన్.. ‘లవ్ మ్యారేజ్ చేసుకోవాలా? లేక పెద్దలు కుదిర్చిన అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలా?’ అనేది. ఈ రెండు వర్గాల మధ్య ఎప్పుడూ ఒక ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తూనే ఉంటుంది. సరిగ్గా యువత నాడిని పట్టుకుని, ఇదే బర్నింగ్ టాపిక్‌ను తెరపైకి తీసుకురాబోతోంది ఓ చిత్రం. అదే ‘321’.. దీనికి ‘లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్డ్’ అనేది ఉప శీర్షిక (ట్యాగ్ లైన్). టైటిల్ తోనే తీవ్ర సంచలనం రేపుతున్న ఈ చిత్రం ఇప్పుడు మ్యూజికల్ గానూ మ్యాజిక్ చేయడం మొదలుపెట్టింది.
బ్రహ్మ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ నుంచి తాజాగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన ‘నను తాకిన’ పాట శ్రోతలను ఇన్‌స్టంట్‌గా ఆకట్టుకుంటోంది. అమ్మాయి, అబ్బాయి మధ్య పుట్టే తొలి ప్రేమలోని మాధుర్యాన్ని, సున్నితమైన భావోద్వేగాలను ఎంతో అందంగా ఈ పాటలో ఆవిష్కరించారు. సంగీత దర్శకుడు కాల్విన్ జాయ్ అందించిన మనసైన మెలోడీకి.. సింగర్స్ సాయి చరణ్, హరిణి తమ గాత్రంతో ప్రాణం పోశారు. మెహర్ బాబా మాస్టర్ కొరియోగ్రఫీ ఈ లవ్ సాంగ్ కు పర్ఫెక్ట్ గా సింక్ అయింది.
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. దర్శకుడు శాంతి కుమార్ చిలుముల ఈ ప్రాజెక్ట్ కోసం మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు. ఆయన కేవలం ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా, రామానుజ రెడ్డి వంగపాటితో కలిసి నిర్మాణ బాధ్యతలు కూడా పంచుకున్నారు. అంతటితో ఆగకుండా, ఇప్పుడు చార్ట్ బస్టర్ గా మారుతున్న ‘నను తాకిన’ పాటకు ఎంతో అర్థవంతమైన సాహిత్యాన్ని (లిరిక్స్) కూడా ఆయనే స్వయంగా అందించడం విశేషం. దర్శకుడికి కథపై ఉన్న పట్టు వల్లే ఇంత ఫీల్ గుడ్ లిరిక్స్ వచ్చాయని ప్రశంసలు దక్కుతున్నాయి. మోహిత్, లావణ్య ప్రధాన జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో వివాన్ సూర్య, లక్ష్మీ వెన్నెల, యామిని, శ్రీనివాస్ భోగిరెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. శివ ప్రసాద్ ముప్పాల విజువల్స్ అందిస్తుండగా, శివ శర్వాణి ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!