3 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన “ఖిలాడీ”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ “ఖిలాడీ”. రవితేజకు ఇది 67వ చిత్రం. ‘రాక్షసుడు’ ఫేమ్ డైరెక్టర్ రమేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఉగాది కానుకగా ఏప్రిల్ 12న ‘ఖిలాడీ’ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. టీజర్ విడుదలై 24 గంటలు కూడా గడవకముందే ‘ఖిలాడీ’ 3 మిలియన్ వ్యూస్ ను క్రాస్ చేయడం విశేషం. ‘ఖిలాడీ’ ఉగాది పోస్టర్ ను విడుదల చేస్తూ ఈ విషయాన్ని ప్రకటించారు మేకర్స్. టీజర్లో ‘ఇఫ్ యూ ప్లే స్మార్ట్ విత్ అవుట్ స్టుపిడ్ ఎమోషన్స్… యూ ఆర్ అన్ స్టాపబుల్’ అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇక టీజర్ చివర్లో వచ్చిన ట్విస్ట్ అందరినీ థ్రిల్ చేసింది. రవితేజ ఒక అమ్మాయిని చంపుతూ కన్పించి అందరికీ షాకిచ్చాడు. ఇక దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ పతాకాలపై సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. జయంతిలాల్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ‘ఖిలాడీ’ ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లింప్స్ భారీ హైప్ క్రియేట్ చేయగా… టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.
Also Read
- Karthik Dandu: డిసెంబర్ 4న తెలుగు ఇండస్ట్రీ గర్వపడే సినిమా రాబోతోంది..
- Dada Movie: బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా!
- Crazy Crossover: సూర్య కోసం మమిత 'ప్రేమలు'కు బ్రేకప్.. ప్రతీకారం తీర్చుకోవడానికే 'సీన్'లోకి నస్లెన్!
- Bunny Vasu: నిర్మాతల చేతుల్లో రిలీజ్ డేట్లు లేవు.. మా బాధ ఎవరికి చెప్పుకోవాలి?
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-15 Live : కోటి దీపోత్సవంలో శ్రీనివాస కల్యాణం.. 15వ రోజు విశేషాలివే.!
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ల జాబితా కేసు.. కోర్టులో ఢిల్లీ పోలీసుల రెండు నివేదికలు..
-
Karthik Dandu: డిసెంబర్ 4న తెలుగు ఇండస్ట్రీ గర్వపడే సినిమా రాబోతోంది..
-
Telangana IAS Transfers : తెలంగాణలో కీలక ఐఏఎస్‌ల బదిలీలు.. హెచ్ఎండీఏ, మెట్రోకు కొత్త బాస్‌లు
-
Dada Movie: బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా!
-
CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక సమీక్ష.. కరువు, తుఫాన్ల బాధిత రైతులకు రూ.2,459 కోట్ల పరిహారం..
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!