గౌతమి లేకుండానే కమల్ “పాపనాశం-2” ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉలగనాయగన్ కమల్ హాసన్ ఇప్పుడు “విక్రమ్” అనే సినిమాను చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ప్రముఖ తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. అయితే తాజా సమాచారం ప్రకారం “విక్రమ్” కంటే ముందే కమల్ “పాపనాశం-2″ను పూర్తి చేయాలని భావిస్తున్నారట. అయితే “పాపనాశం”లో హీరోయిన్ రోల్ లో నటించిన గౌతమి సీక్వెల్ లో భాగం కాకపోవచ్చని అంటున్నారు. గౌతమి స్థానంలో మీనా పేరును మేకర్స్ పరిశీలిస్తున్నారట. మోహన్ లాల్ హీరోగా దర్శకుడు జీతు జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన “దృశ్యం 2” అధికారిక తమిళ రీమేక్ “పాపనాశం-2”. దర్శకుడు జీతు జోసెఫ్ “పాపనాశం” చేసినప్పుడు… గౌతమి, కమల్ హాసన్ రిలేషన్ లో ఉన్నారు. అయితే 2016లో కొన్ని సమస్యల కారణంగా ఈ జంట విడిపోయారు. అందుకే ఈ సీక్వెల్ లో గౌతమి ఉండకపోవచ్చని చెబుతున్నారు. ఇప్పుడు దర్శకుడు జీతు జోసెఫ్, కమల్ హాసన్ సీక్వెల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మొదటి భాగాన్ని సహ నిర్మించిన నటి శ్రీప్రియా సీక్వెల్‌ను కూడా నిర్మించనుంది. “దృశ్యం”లాగే “పాపనాశం” కూడా భారీ హిట్ గా నిలిచింది. గత సంవత్సరం “దృశ్యం 2” విడుదలైనప్పుడు మీడియా సంభాషణలో “పాపనాశం-2″కి దర్శకత్వం వహిస్తారా ? అని అడగ్గా… దర్శకుడు జీతు జోసెఫ్ “కమల్ హాసన్ సిద్ధంగా ఉంటే, నేను ఈ చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నాను” అని అన్నారు. మరి ఇది ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో? హీరోయిన్ గా ఎవరు నటిస్తారో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!