Site icon NTV Telugu

హీరోగా నితిన్ కి 19 ఏళ్ళు

19 Years for Nithiin in TFI Cinema industry

2002లో ‘జయం’ సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు నితిన్. పంపిణీదారుడు సుధాకర్ రెడ్డి కుమారుడైన నితిన్ ని హీరోగా పెట్టి చిత్రం మూవీస్ పతాకంపై దర్శకుడు తేజ స్వయంగా ‘జయం’ సినిమాను నిర్మించాడు. సదా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో గోపీచంద్ విలన్ గా నటించాడు. పట్నాయక్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా మ్యూజికల్ గా హిట్ అయి ఘన విజయం సాధించింది. జూన్ 14, 2002న ‘జయం’ విడుదలైంది. అంటే హీరోగా నితిన్ కెరీర్ కి కూడా 19 ఏళ్ళు అన్నమాట. ఈ 19 సంవత్సరాలతో దాదాపు 30 సినిమాలలో నటించాడు నితిన్. వాటిలో ‘జయం’, ‘దిల్’, ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయిందే’, ‘ఆఆ’, ‘బీష్మ’ వంటి హిట్స్ ఉన్నాయి. ఇక పరాజయాలకు కొదవే లేదు. ప్రస్తుతం ‘మాస్ర్టో’ సినిమాతో బిజీగా ఉన్నాడు నితిన్.

Exit mobile version