1000 Wala : తిండి తినకుండా ప్రయత్నాలు చేసి హీరో అయ్యా !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నూతన నటుడు అమిత్ హీరోగా తెరంగ్రేటం చేస్తున్న చిత్రం 1000వాలా. యువ దర్శకుడు అఫ్జల్ సూపర్ హిట్ మూవీ మేకర్స్ పతాకం పై షారుఖ్ నిర్మాణంలో ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు . నటులు సుమన్, పిల్లాప్రసాద్, ముఖ్తార్ ఖాన్ లు ప్రధాన పాత్రలలో నటిస్తున్న, భారీ హంగులతో రూపొందిన ఈ చిత్రాన్ని అతి త్వరలో థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో అతిథుల సమక్షంలో ఈ చిత్ర యూనిట్ ఫ్రీ రిలీజ్ వేడుకని నిర్వహించారు. ముఖ్య అతిధిగా వచ్చిన హీరో సుమన్ ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా సీనియర్ హీరో సుమన్ మాట్లాడుతూ ఈ సినిమా మొత్తం ఒక యాంగ్ టీం చేయడం చాలా ఉత్సాహన్ని ఇచ్చింది. షూటింగ్ లోకేషన్ లో సైతం వీళ్ళ టీం వర్క్ చూసి చాలా ముచ్చట వేసింది.సినిమా చాలా బాగా వచ్చింది టీం అందరికి శుభాకాంక్షలు, హిరో కి, డైరెక్టర్ కి, ప్రొడ్యూసర్ కి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను.
Also Read
హీరో అమిత్ మాట్లాడుతూ హీరో అవ్వాలి అనేది నా 10 ఏళ్ల కళ, కష్టాలు చూసి, బాధ చూసాను, ఎన్నో ఇబ్బందులు పడ్డాను, తిండి తినకుండా ప్రయత్నాలు చేసా, ఎలాంటి సపోర్ట్ లేకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలో కి ఎంటర్ అయ్యాను, నా డైరెక్టర్ అఫ్జల్, నిర్మాత షారుఖ్ ల వలన ఈ సినిమా మొదలు పెట్టాం, చాలా మంచి అవుట్‌పుట్ వచ్చింది అన్నారు. దర్శక నిర్మాతలు మాట్లాడుతూ “మా 1000 వాలా సినిమా టీజర్ సోషల్ మీడియా ప్రేక్షకులని ఆకట్టుకుంది. అనేక మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే సత్తా ఉన్న ఈ సినిమా అందరి అంచనాలను మించి తప్పక భారీ విజయం సాధిస్తుంది అనే నమ్మకం ఉంది. ఈ కార్యక్రమంలో విడుదల చేసిన ట్రైలర్ కి సైతం మంచి రెస్పాన్స్ వచ్చింది, ఇక్కడికి వచ్చిన అతిథులందరి పేరు పేరునా ధన్యవాదాలు. ఈ సినిమా మా ఒక్కరిది కాదు, సినిమా లో భాగంఐనా ప్రతి ఒక్కరిది ఈ సినిమా అని డైరెక్టర్ అఫ్జల్, నిర్మాత షారుక్ అన్నారు. అతి త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం” అని చిత్ర బృందం తెలిపారు.
తాజావార్తలు
-
Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్… మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
-
UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
-
TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?