Film Studio: ఏపీలో 100 ఎకరాల ఫిలిం స్టూడియో!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
100 Acres Film Studio to be Established in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో ఒక భారీ సినిమా స్టూడియోని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు టాలీవుడ్ నిర్మాతలు. నిజానికి తెలుగు సినిమా షూటింగ్స్ అనగానే ముందుగా హైదరాబాద్ గుర్తొస్తుంది. ఎందుకంటే హైదరాబాదులో చాలా సినిమాలు షూటింగ్ జరుపుకుంటూ ఉంటాయి దానికి తగ్గట్టుగానే స్టూడియోలు కూడా ఉన్నాయి. ఏపీలో విశాఖపట్నంలోని రామానాయుడు స్టూడియో లాంటివి ఉన్నాయి కానీ పూర్తి స్థాయిలో సినిమాల షూటింగ్స్ కి అవి ఉపయోగపడతాయా? అంటే అవునని చెప్పలేని పరిస్థితి.. ఈ నేపథ్యంలో సినిమా పరిశ్రమకు చెందిన కొందరు ఒక సిండికేట్ గా ఫామ్ అయ్యి ఏపీలో స్టూడియోని నిర్మించే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
Nani- Janhvi Kapoor: వామ్మో జాన్వీ మా హీరో పక్కన వద్దు బాబోయ్!
Also Read
ఏపీలోని ఉత్తరాంధ్ర లేదా గోదావరి జిల్లాలలో సుమారు 100 ఎకరాల్లో ఒక భారీ స్టూడియోని నిర్మించే ప్లాన్ చేస్తున్నారు. ఈ మధ్యనే సినిమా పెద్దలు పవన్ కల్యాణ్ ను కలిశారు. చంద్రబాబును కలిసేందుకు రెడీ అవుతున్న క్రమంలో ఆ లోపు బాబు వద్ద పూర్తి స్థాయి స్టూడియో ప్రతిపాదనను పెట్టాలనుకుంటున్నారని అంటున్నారు. ప్రభుత్వం వద్ద ఫ్రీగా లేదా తక్కువ రేటు లీజుకు భూములు తీసుకోకుండా కొనుగోలు ప్రక్రియ ద్వారానే స్టూడియో కడితే భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందీ లేకుండా అలా కొనుగోలు చేయాలని అంటున్నారు. ఒక్క ప్రొడ్యూసర్ స్టూడియో కట్టడం అనేది ఇప్పుడు సాధ్యం కాదని… ఓ గ్రూపుగా ఏర్పడి చేయాల్సిందేనని ప్రచారం జరుగుతోంది. మరి ఇది ఎంతవరకు నిజం అవుతుంది అనేది కాలమే నిర్ణయించాలి మరి.
తాజావార్తలు
-
Peddi : “పెద్ది”పై అల్లు అర్జున్ జెన్యూన్ రివ్యూ… ప్రశంసల వర్షం
-
Zojila Tunnel Breakthrough: భారత ఇంజినీరింగ్ అద్భుతం.. ‘జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ’ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
-
Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
-
Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్ ఫైర్!
-
Thalaivar173 : డాక్టర్ గా సూపర్ స్టార్.. డైరెక్టర్ ఎవరంటే
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!