Site icon NTV Telugu

Film Studio: ఏపీలో 100 ఎకరాల ఫిలిం స్టూడియో!!

Movie Shooting

Movie Shooting

100 Acres Film Studio to be Established in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో ఒక భారీ సినిమా స్టూడియోని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు టాలీవుడ్ నిర్మాతలు. నిజానికి తెలుగు సినిమా షూటింగ్స్ అనగానే ముందుగా హైదరాబాద్ గుర్తొస్తుంది. ఎందుకంటే హైదరాబాదులో చాలా సినిమాలు షూటింగ్ జరుపుకుంటూ ఉంటాయి దానికి తగ్గట్టుగానే స్టూడియోలు కూడా ఉన్నాయి. ఏపీలో విశాఖపట్నంలోని రామానాయుడు స్టూడియో లాంటివి ఉన్నాయి కానీ పూర్తి స్థాయిలో సినిమాల షూటింగ్స్ కి అవి ఉపయోగపడతాయా? అంటే అవునని చెప్పలేని పరిస్థితి.. ఈ నేపథ్యంలో సినిమా పరిశ్రమకు చెందిన కొందరు ఒక సిండికేట్ గా ఫామ్ అయ్యి ఏపీలో స్టూడియోని నిర్మించే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

Nani- Janhvi Kapoor: వామ్మో జాన్వీ మా హీరో పక్కన వద్దు బాబోయ్!

ఏపీలోని ఉత్తరాంధ్ర లేదా గోదావరి జిల్లాలలో సుమారు 100 ఎకరాల్లో ఒక భారీ స్టూడియోని నిర్మించే ప్లాన్ చేస్తున్నారు. ఈ మధ్యనే సినిమా పెద్దలు పవన్ కల్యాణ్ ను కలిశారు. చంద్రబాబును కలిసేందుకు రెడీ అవుతున్న క్రమంలో ఆ లోపు బాబు వద్ద పూర్తి స్థాయి స్టూడియో ప్రతిపాదనను పెట్టాలనుకుంటున్నారని అంటున్నారు. ప్రభుత్వం వద్ద ఫ్రీగా లేదా తక్కువ రేటు లీజుకు భూములు తీసుకోకుండా కొనుగోలు ప్రక్రియ ద్వారానే స్టూడియో కడితే భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందీ లేకుండా అలా కొనుగోలు చేయాలని అంటున్నారు. ఒక్క ప్రొడ్యూసర్ స్టూడియో కట్టడం అనేది ఇప్పుడు సాధ్యం కాదని… ఓ గ్రూపుగా ఏర్పడి చేయాల్సిందేనని ప్రచారం జరుగుతోంది. మరి ఇది ఎంతవరకు నిజం అవుతుంది అనేది కాలమే నిర్ణయించాలి మరి.

Exit mobile version