ధనుష్ నటించిన రెండు సినిమాలు ఓటీటీలో విడుదల కాబోతున్నాయి. యాక్షన్ థ్రిల్లర్ ‘జగమే తంతిరమ్’ను వైనాట్ స్టూడియో జూన్ 18న తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఓటీటీలో విడుదల చేయబోతోంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో యస్. శశికాంత్, చక్రవర్తి, రామచంద్ర ఈ సినిమాను నిర్మించారు. ఇందులో ధనుష్ కి జోడీగా ఐశ్వర్యాలక్ష్మి నటించింది. ఈ గ్యాంగ్ స్టర్ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందించారు. ఇందులో ధనష్ ఓ పాట కూడా పాడటం విశేషం. ఇదిలా ఉంటే ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన ధనుష్ సినిమా ‘కర్ణన్’ ను మే 7న ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అంటే రెండు నెలల్లో ధనుష్ సినిమాలు రెండు డిజిటల్ లో రాబోతున్నాయన్నమాట. ఇది ధనుష్ అభిమానులకు పండగ లాంటి న్యూస్ అన్నమాట.