Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో హీరో అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఇవాళ ఉదయం విచారణకు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్టేషన్ కు వెళ్లారు. న్యాయవాది అశోక్ రెడ్డి నేతృతంలో అల్లు అర్జున్ విచారణ కొనసాగుతుంది. డీసీపీ సెంట్రల్ జోన్ నేతృతంలోని బృందం అల్లు అర్జున్ విచారిస్తున్నారు. సెంట్రల్ జోన్ అదనపు డీసీపీ చిక్కడపల్లి ఏసీపీ చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ ఎస్ఐలతో కలిపి విచారణ చేపట్టారు.
Read also: Allu Arjun : పోలీస్ స్టేషన్ కు చేరుకున్నఅల్లు అర్జున్..
సుమారు 50 పైగా ప్రశ్నల్ని అధికారులు అల్లు అర్జున్ ముందు ఉంచారు. బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన వ్యవహారంపై అధికారులు ప్రశ్నిస్తున్నారు. రాత్రి 9:30 గంటల నుంచి బయటికి వెళ్లే వరకు ఏం జరిగింది అనే దానిపై అల్లు అర్జున్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అనుమతి ఉందా లేదా అనే విషయాన్ని ప్రశ్నిస్తున్న అధికారులు. తొక్కిసలాట సంఘటనలో చనిపోయిన విషయం తెలుసా? లేదా? అని అల్లు అర్జున్ను అధికారులు ప్రశ్నిస్తున్నారు. రేవతి చనిపోయిన విషయం ఎప్పుడు తెలిసిందని అల్లు అర్జున్ను అధికారులు ప్రశ్నిస్తున్నారు.
Read also: Allu Arjun Live Updates: పోలీస్ విచారణకు అల్లు అర్జున్.. లైవ్ అప్డేట్స్..
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో హీరో అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. నేడు ఉదయం 11 గంటలకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు చిక్కడపల్లి పోలీసులు. గతవారం సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్టయిన అల్లు అర్జున్‌కు హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. దీంతో అల్లు అర్జున్ బెయిల్‌పై ఉన్న ఈ రోజు పోలీసుల ఎదుట హాజరయ్యారు.
Read also: AlluArjun : చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తు.
అల్లు అర్జున్ను దర్యాప్తు అధికారి ఏసీపీ రమేష్ కుమార్ తో పాటు సెంట్రల్ జోన్ డీసీపీలు విచారిస్తున్నారు. ఈ కేసులో 11వ ముద్దాయిగా ఉన్న అల్లు అర్జున్ నేడు పోలీసులు ముందు విచారణలో బన్నీ స్టేట్ మెంట్ రికార్డింగ్ చేయనున్నారు పోలీసులు. చిక్కడపల్లి పీఎస్ లో సంధ్య థియేటర్ ఘటన దృశ్యాలను బన్నీకి చూపనున్నారు. పోలీసుల ప్రశ్నలకు అల్లు అర్జున్ ఏం సమాధానం చెబుతారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
DK Aruna: అల్లు అర్జున్ ను టార్గెట్ చేస్తుంది అందుకే.. డీకే అరుణ కీలక వ్యాఖ్యలు