Site icon NTV Telugu

వచ్చే ఏడాది పవన్- మహేష్ మల్టీస్టారర్..?

pawan-mahesh

pawan-mahesh

టాలీవుడ్ లో అందరు ఎదురుచూసే కాంబో .. పవన్ కళ్యాణ్- మహేష్ బాబు. ఫ్యాన్స్ వార్ అని హీరోల ఫ్యాన్స్ కొట్టుకుంటున్నా వీరి మధ్య స్నేహ బంధం మాత్రం ఎప్పుడు ప్రత్యేకంగానే ఉంటుంది. పవన్- మహేష్ ల మధ్య ఉన్న స్నేహ బంధానికి నిదర్శనమే .. ప్రతి ఏడాది క్రిస్టమస్ కి పవన్, మహేష్ ఇంటికి పంపే కానుకలే. ప్రతియేటా పవన్ తన తోటలో పండిన మామిడి పండ్లను మహేష్ కుటుంబానికి పంపిస్తుంటారు. ఇక క్రిస్టమస్ వచ్చిందంటే ఒకరికి ఒకరు గింప్ట్ హ్యాంపర్లు పంపించడం.. వారికి థాంక్స్ చెప్తూ నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఎప్పుడు జరిగిదే. ఇక ఈ ఏడాది కూడా అదే జరిగింది. తాజాగా మహేష్ ఇంటికి పవన్ క్రిస్టమస్ కానుకలు పంపారు. దీంతో నమ్రత పవన్ దంపతులకు థాంక్స్ చెప్తూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. `థాంక్యూ పవన్ అండ్ అన్నా ఫర్ ది లవ్ లీ హ్యాంపర్!` అంటూ నమ్రత ఆనందం వ్యక్తం చేశారు.

https://ntvtelugu.com/unstaoppable-episode-6-poster-released/

ఇక ఈ పోస్ట్ పై మహేష్- పవన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే నమ్రత వద్ద ఒక రిక్వెస్ట్ ని కూడా అడుగుతున్నారు. ఎప్పటినుంచో అందరి మనసులో ఉన్న కోరికను ఏకరువు పెట్టారు. పవన్ – మహేష్ లా మల్టీస్టారర్ ఎప్పుడు..? కనీసం నమ్రత గారు మీరైనా ఈ అద్భుతానికి పూనుకోండి అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. జల్సా చిత్రంలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ న్నీ మహేష్ తో చెప్పించిన దర్శకుడు త్రివిక్రమ్. ఇద్దరికీ భారీ విజయాలను అందించిన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ . వీరిద్దరి మల్టీస్టారర్ కూడా అతనే దిరెచ్తిఒన్ చేస్తే బావుంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తోంది. కనీసం వచ్చే ఏడాదైనా ఈ మ్యాజిక్ కాంబో రావాలని దేవుడ్ని ప్రార్దిస్తున్నామని అభిమానులు అంటున్నారు. మరి అభిమానుల కోరిక వచ్చే ఏడాది తీరనుందా.. ? ఈ ఇద్దరు స్టార్లను ఒకే ఫ్రేమ్ లో చూడనున్నామా ..? అనేది తెలియాల్సిఉంది.

Exit mobile version