Site icon NTV Telugu

Chiyan Vikram: బ్రేకింగ్.. హీరో విక్రమ్ కు గుండెపోటు

Vikram

Vikram

కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ గుండెపోటుకు గురయ్యారు. కొద్దిసేపటి క్రితం ఆయనకు చెస్ట్ లో పెయిన్ రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు చెన్నైలోని కావేరి హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ప్రస్తుతం విక్రమ్ కు వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఇటీవలే విక్రమ్ కరోనా బారిన పడి కోలుకున్న విషయం విదితమే.. ఈ నేపథ్యంలోనే ఆయనకు గుండెపోటు రావడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇక నేడు విక్రమ్ నటించిన పొన్నియన్ సెల్వన్ టీజర్ లాంచ్ జరుగుతున్న విషయం తెల్సిందే. సాయంత్రం 6 గంటలకు విక్రమ్ ఈ ఈవెంట్ లో పాల్గొనాల్సి ఉండగా.. ఇంతలోనే ఆయన గుండెపోటుకు గురయ్యారు. విక్రమ్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు దేవుడ్ని ప్రార్థిస్తున్నారు.

Exit mobile version