చిట్టిగా ఓవర్ నైట్‌లో యూత్ క్రష్‌గా మారింది పొడుగు కాళ్ల సుందరి ఫరియా అబ్దుల్లా. జాతిరత్నాలుతో తెలుగు పరిశ్రమకు మరో టాలెంట్ లోకల్ యాక్ట్రెస్ దొరికేసింది అనుకున్నారు. కట్ చేస్తే ఆ తర్వాత చేసిన సినిమాలేవీ ఆశించిన విజయాలు అందించలేదు. అక్కినేని హీరోలతో ఛాన్స్ వచ్చిందీ కానీ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్, బంగార్రాజులో జస్ట్ క్యామియో రోల్స్‌తో సరిపెట్టేసుకుంది. లైక్ అండ్ షేర్ సబ్ స్క్రైబ్, రావణాసుర, ఆ ఒక్కటి అడక్కు ప్లాప్ టాక్ తెచ్చాయి.…