Chitrapuri Colony Scam: చిత్రపురి కాలనీ అక్రమాల కేసులో విచారణ పూర్తి.. సినీ పెద్దల పాత్రపై కీలక రిపోర్టు!

  • చిత్రపురికాలనీ అక్రమాల కేసులో విచారణ పూర్తి
  • అక్రమాలకు 15 మందిని బాధ్యులను చేస్తూ రిపోర్టు
  • పాత, ప్రస్తుత కమిటీ సభ్యుల పాత్ర ఉందంటూ నివేదిక
Chitrapuri Colony Scam

Chitrapuri Colony Scam

సినీ కార్మికుల కలల సౌధమైన చిత్రపురి కాలనీ అక్రమాల కేసులో విచారణ పూర్తయింది. అక్రమాలకు 15 మందిని బాధ్యులను చేస్తూ కమిటీ రిపోర్టు ఇచ్చింది. పాత, ప్రస్తుత కమిటీ సభ్యుల పాత్ర ఉందంటూ నివేదికలో కమిటీ పేర్కొంది. నవంబర్ 27న తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక అందింది. కమిటీలో ఉంటూ నిధులు కాజేసిన పలువురు సినీ పెద్దల పాత్రపై రిపోర్టులో కీలక అంశాలను కమిటీ పోందుపర్చింది. ఫైనల్ రిపోర్టులో పలువురు సినీ పెద్దల పేర్లు ఉన్నాయి. చిత్రపురి కాలనీ హౌసింగ్‌ సొసైటీలో ప్లాట్ల కేటాయింపులో 2005 నుంచి 2020 వరకూ జరిగిన అవకతవలపై కమిటీ విచారణ జరిపింది.

Also Read: Ishan Kishan Double Century: 24 ఫోర్లు, 10 సిక్సర్లు.. ఇషాన్ కిషన్ రికార్డు డబుల్ సెంచరీ!

నివేదికలో తమ్మారెడ్డి భరద్వాజ్, పరుచూరి వెంకటేశ్వరరావు, వినోద్ బాల, కొమర వెంకటేష్, కాదంబరి కిరణ్, బత్తుల రఘు, దేవినేని బ్రహ్మానంద, వల్లభనేని అనిల్తో పాటు పలువురి పేర్లు ఉన్నాయి. సినీ పెద్దల నుంచి రూ.43.78 కోట్లు రికవరీ చేయాలని రిపోర్టులో కమిటీ పేర్కొంది. అదనంగా 18 శాతం చెల్లించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. గోల్కొండ కోఆపరేటివ్ సొసైటీస్ డిప్యూటీ రిజిస్ట్రార్ తెలంగాణ ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించారు. పలువురు సినీ పెద్దలు కమిటీలో ఉంటూ నిధులు కాజేశారని రిపోర్టులో చెప్పుకొచ్చారు.